రాష్ట్రీయం

వీడుకోలంటూ.. వీడలేమంటూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: వారంతా దశాబ్దాలపాటు కలసి మెలిసి పనిచేశారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకున్నారు. కులాలు, ప్రాంతాలు వారి అనుబంధానికి ఎప్పుడూ అడ్డుగోడలు కాలేదు. కానీ, రాష్ట్ర విభజన వారిని విడదీసింది. విడిపోవడం, తరలిపోవడం అనివార్యమయింది. హైదరాబాద్‌తో దశాబ్దాలపాటు పెనవేసుకున్న అనుబంధం నేటితో ముగిసిపోయింది. ‘ఇక మనం ఇలాగే రోజూ కలవబోమ’న్న భావన వారి గుండె కలుక్కుమనేలా చేసింది. ఫలితం.. భావోద్వేగం. కన్నీళ్ల మధ్య కౌగిలింతలు, వీడ్కోళ్లు. గుంటూరుకు తరలివెళ్లిన ఏపి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద కనిపించిన ఆంధ్ర-తెలంగాణ మహిళా ఉద్యోగినుల భావోద్వేగ దృశ్యాలివి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 27లోగా అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్‌ఓడీలు వెలగపూడికి తరలివెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు శాఖలు తరలివెళ్లాయి. అందులో భాగంగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ-ఆంధ్ర ఉద్యోగులు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో కలి‘విడి’గా పనిచేస్తున్నారు. గురువారం గుంటూరుకు తరలివెళ్లేందుకు, మహిళా ఉద్యోగినులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. అంతకుముందు.. అక్కడికి చేరిన తెలంగాణ మహిళా ఉద్యోగినులు ఇప్పటివరకూ లంచ్ టైంలో కలసి భోజనం చేసి, సాయంవేళ ఒకే బస్సుల్లో వెళ్లి, ఒకరి ఇళ్లలో జరిగే మంచీ చెడుకు మరొకరు తోడుగా నిలిచిన తీపి అనుభవాలను గుర్తుచేసుకుని, కన్నీటి పర్యంతమయ్యారు. తమను విడిచి వెళ్లిపోతున్న ఏపి ఉద్యోగినులను ఆలింగనం చేసుకుని, కన్నీటితో వీడ్కోలు పలికారు. కొందరు బొట్టు పెట్టి చీరలు పెట్టారు. ఈ దృశ్యాలను చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి.

చిత్రాలు గురువారం ఏపీకి తరలిపోతూ భావోద్వేగానికి గురైన
ఐ అండ్ పిఆర్ సిబ్బందిని ఓదారుస్తున్న తెలంగాణ ఉద్యోగినులు,
హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలివచ్చిన వ్యవసాయ శాఖ ఉద్యోగులకు స్వాగతం పలుకుతున్న స్థానిక అధికారులు