రాష్ట్రీయం

విద్యుత్ వాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాదీ వినియోగదారులకు విద్యుత్‌షాక్ ఇచ్చింది. నిరుడు రూ.816కోట్ల భారాన్ని మోపిన సర్కారు ఈసారి ఏకంగా జనంపై రెట్టింపు భారం మోపింది. మొత్తం రూ. 1527 కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచారు. గృహ వినియోగదారులపై రూ. 510 కోట్ల భారాన్ని విధించారు. అన్ని వర్గాలపై 7.5 శాతం మేర విద్యుత్ చార్జీల భారాన్ని విధిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి కొత్త టారిఫ్ విధానాన్ని గురువారం రాత్రి ప్రకటించింది. పెరిగిన విద్యుత్ చార్జీలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. గృహ విద్యుత్ రంగంలో తొలి వంద యూనిట్లలోపు విద్యుత్ వినిమయం చేసే వినియోగదారులకు చార్జీల పెంపుదల వర్తించదు. వంద యూనిట్లు దాటితే మాత్రం కరెంటు వాతలు తప్పవు. 60లక్షల మంది గృహ విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం పడలేదు. పెంచిన చార్జీల ప్రభావం 21 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులపై పడింది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తారు. విద్యుత్తు రెవెన్యూ లోటు రూ. 8589కోట్లు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.4584 కోట్ల మేర సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది. రూ.1958కోట్ల మేర విద్యుత్ చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కాంలు కోరగా టిఎస్‌ఇఆర్‌సి రూ.1527 కోట్లు చార్జీలు పెంచేందుకు అనుమతించింది.
గృహ విద్యుత్ వినియోగ రంగంలో మూడు శ్లాబులు, 9 రకాలుగా చార్జీలను వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. గృహ విద్యుత్ రంగంలో మొదటి శ్లాబులో తొలి వంద యూనిట్లలో 0-50 వరకు యూనిట్‌కు రూ.1.45, 51-100 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.2.60 చార్జీలను యథావిధిగా కొనసాగించారు. రెండో శ్లాబులో 200 యూనిట్ల వరకు రెండు విధానాలుగా వర్గీకరించారు. ఇందులో 0-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.30, 101-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.4.30 నిర్ణయించారు.
మూడో శ్లాబులో రెండు వందల యూనిట్లు దాటితే ఐదు విధానాలుగా వర్గీకరించారు. 0-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5, 201-300 యూనిట్ల వరకు రూ.7.20, 301-400 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 8.50, 401-800 యూనిట్ల మధ్య యూనిట్‌కు రూ.9, ఇక 800 యూనిట్లు దాటితే రూ.9.50 టారిఫ్‌ను నిర్ణయించారు. నాన్ డొమెస్టిక్ వాణిజ్య రంగంలో 0-50 యూనిట్ల వరకు ఆరు రూపాయలు, రెండో శ్లాబులో వంద యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.7.50, 101-300 యూనిట్ల వరకు రూ. 8.90, 301-500 యూనిట్ల వరకు రూ.9.40, ఐదు వందల యూనిట్లు దాటితే రూ.10 చార్జీని వసూలు చేస్తారు. అడ్వర్టైజింగ్ హోర్డింగ్స్‌లో యూనిట్ రూ.12 వసూలు చేస్తారు. హెయిర్ కటింగ్ సెలూన్లకు కొత్తశ్లాబ్‌ను ప్రవేశపెట్టారు. 0-50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.30, 51-100 యూనిట్ల వరకు రూ.6.60, 101-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.7.50 వసూలు చేస్తారు. దేవాలయాలకు 2కిలోవాట్ వరకు లోడ్ పరిమితిని తొలగించారు. 2కిలోవాట్ కంటే మించి విద్యుత్ వినిమయం చేసే దేవాలయాలకు ఎల్‌టి 7(బి) కింద కొత్త శ్లాబును ప్రవేశపెట్టారు. ఎల్‌టి-3(5) పరిధిలోకి గొర్రెలు, మేకల ఫాంలను చేర్చారు. హెచ్‌టి వి రైల్వే ట్రాక్షన్ సబ్ కేటగిరీ పరిధిలో హైదరాబాద్ మెట్రో రైల్‌ను చేర్చారు.
వీధి దీపాలకు సంబంధించి పంచాయితీల్లో యూనిట్ రూ.5, మున్సిపాలిటీల్లో రూ.6.10, నగర పాలక సంస్థల్లో రూ.7.10, మంచి నీటి స్కీంల్లో పంచాయితీల్లో యూనిట్ రూ.5, మున్సిపాలిటీల్లో రూ.6.10, నగర పాలక సంస్థల్లో యూనిట్‌కు రూ.6.60 వసూలు చేస్తారు. కస్టమర్ చార్జీలు 0-50 యూనిట్ల వరకు రూ.25, 51-100 యూనిట్లకు రూ.30, 101-200 యూనిట్లకు రూ.50, 101-200 యూనిట్లకు రూ.60, 301-400, 401-800, 800 యూనిట్లు దాటితే రూ.80 వసూలు చేస్తారు. హార్టికల్చర్ నర్సరీల్లో 15 హెచ్‌పి సామర్థ్యం పంపుసెట్లు వినియోగించేవారికి విద్యుత్ చార్జీలను పెంచారు.

***
గృహవిద్యుత్ రంగంలో సవరించిన చార్జీల టారిఫ్
యూనిట్లు పాత చార్జీలు కొత్త చార్జీలు
మొదటి వంద యూనిట్ల వరకు
0-50 యూనిట్లు రూ.1.45 పై. రూ.1.45 పైసలు
51-100 యూనిట్లు రూ.2.60 పై. రూ.2.60 పైసలు
0-100 యూనిట్లు రూ.2.60 పై. రూ.3.30 పైసలు
101-200 యూనిట్లు రూ.3.60 పై. రూ.4.30పైసలు
2015-16 సంవత్సరంలో 200 యూనిట్లు దాటినట్లైతే ఎల్‌టి బి (2)లో ఎనిమిది శ్లాబులు ఉండేవి. ఇప్పుడు ఇదే కేటగిరీలో శ్లాబులను 5కు పరిమితం చేశారు.

**
యూనిట్లు చార్జీలు
0-200 రూ.5
201-300 రూ.7.20 పైసలు
301-400 రూ.8.50 పైసలు
401-800 రూ.9
800 యూనిట్లుపైన రూ.9.50 పైసలు