రాష్ట్రీయం

ఆర్టీసీ మోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: తెలంగాణలో రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ) చార్జీలను పెంచింది. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రోడ్డు రవాణశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి, ఆర్టీసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసి జాయింట్ డైరెక్టర్ జెవి రమణరావు ధరల పెంపు ప్రతిపాదనలను సమీక్షించారు. ఆర్టీసి చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆ తరువాత కాసేపటికి సచివాలయంలో మంత్రి మహేందర్‌రెడ్డి పెంచిన చార్జీలను ప్రకటించారు. పెరిగిన ఈ చార్జీలు ఈనెల 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ఆయన వెల్లడించారు. పెరిగిన డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని చార్జీలు పెంచక తప్పలేదని స్పష్టం చేశారు. పల్లెవెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల లోపు రూ. 1, ఆపైన ప్రయాణపు చార్జీ రూ. 2 పెంచామని, అలాగే మిగతా బస్సు సర్వీసులకు 10 శాతం చార్జీలు పెంచినట్టు మంత్రి వెల్లడించారు. పెరిగిన ఆర్టీసి చార్జీలతో ప్రజలపై రూ. 287 కోట్లు భారం పడుతున్నప్పటికీ ఆర్టీసి నష్టాల నుంచి కాస్త బయటపడుతుందన్నారు. దూరపు ప్రాంతాలకు ఏసి బస్సులు నడుపుతామని, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కిలోమీటరుకు 87పైసలు, డీలక్స్ బస్సులకు 98 పైసలు, సూపర్ లగ్జరీకి రూ. 1.16, ఇంద్ర బస్సుల్లో రూ. 1.46, గరుడ బస్సుల్లో రూ. 1.75, గరుడ ప్లస్ బస్సులో కి.మీ. రూ. 1.82లు, అలాగే సీటీ సర్వీసులపైనా పది శాతం చార్జీలు పెంచినట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో బస్సు సౌకర్యం లేని గ్రామాలకు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కొత్తగా 1200 బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్టీసి నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసి అనివార్య పరిస్థితుల్లో చార్జీలు పెంచిందని, నిరుడు 2015-16లో రూ. 701 కోట్లు నష్టం రాగా, సంస్థకు రూ. 2,275 కోట్లు అప్పులున్నాయని, రోజుకు దాదాపు 2కోట్లు నష్టం వాటిల్లిందని మంత్రి వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే తక్కువ చార్జీలు ఉన్నాయని మంత్రి మహేందర్ రెడ్డి వివరించారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి చార్జీలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత టిఆరెస్ ప్రభుత్వం తొలిసారి చార్జీలను పెంచింది.
**
సర్వీసు పాతచార్జి కొత్త చార్జి
(కి.మీ.కు) (కి.మీ.కు)
ఎక్స్‌ప్రెస్ 79 పైసలు 87 పైసలు
డీలక్స్ 89 పైసలు 98 పైసలు
సూపర్ లగ్జరీ 105 పైసలు 116పైసలు
ఇంద్ర 132 పైసలు 145 పైసలు
గరుడ 155 పైసలు 171 పైసలు
గరుడ+ 165 పైసలు 182 పైసలు
పల్లెవెలుగు:
30 కిలోమీటర్ల వరకు(6స్టేజీల వరకు)
రూ.1 పెంపు
30 కిలోమీటర్ల పైన రూ. 2 పెంపు
ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 10శాతం పెంపు
***

చిత్రం ఆర్టీసీ చార్జీల పెంపుదలను ప్రకటిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి