రాష్ట్రీయం

నాణ్యత లోపిస్తే ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: పుష్కర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్ణీత వ్యవధిలో పూర్తిచెయ్యాలని అలా కాని పక్షంలో తీవ్రమైన చర్యలు వుంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా హెచ్చరించారు. విజయవాడ నగర పరిధిలో పుష్కర ఘాట్ల నిర్మాణం, 4లైన్ల రోడ్ల పనులు, దుర్గగుడి పైన చేపడుతున్న విస్తరణ పనులను గురువారం ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పద్మావతి ఘాట్ వద్ద పాత్రికేయులతో మాట్లాడుతూ, పుష్కర పనుల సత్వర పూర్తిపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టాలని అన్నారు. ఇకపై వారం వారం పుష్కర పనులను తనిఖీ చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలతో అందరూ భాగస్వాములై రాజధాని ఔన్నత్యాన్ని చాటేలా పుష్కర యాత్రికులకు ఆధిత్యాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ ఇంట అతిధుల్ని సత్కరించే రీతిలోనే పుష్కర యాత్రికులను ఆదరించాలని సూచించారు. గత గోదావరి పుష్కరాలు రాజమండ్రి వాసులు చూపిన రీతిలోనే పుష్కర యాత్రికులకు ఆతిధ్యం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పుష్కరాలకు సంబంధించి చేపట్టిన అన్ని పనులు శాశ్వత ప్రాతిపదికన విజయవాడ నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వారధి నుంచి కనకదుర్గమ్మ గుడి ఆపైన పవిత్ర సంగమం వరకు నదీ తీరాన్ని సుందరీకరిస్తున్నామన్నారు. విజయవాడ నగరం గుండా వెళ్లే మూడు కాలువలను ఆహ్లాదంగా నగరవాసులు సాయం వేళల్లో సేద తీరేందుకు అనువుగా తీర్చిదిద్దనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బస్ కాంప్లెక్స్ ప్రాంతం, రైల్వే ట్రాక్ పరిసరాలు సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందువల్ల ఎవరికీ నష్టం రాకుండా అవసరమైన పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు. విజయవాడ నగరం రాజధాని ప్రాంతానికి చెందిన అతి ముఖ్యమైనదిగా దీనే్న సర్వాంగ సుందరం తీర్చిదిద్దేందుకు 3వేల కోట్లకు పైనే ఖర్చుతో వివిధ పనులు చేపడుతున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై గతంలో వున్న అన్ని నిర్మాణాలను తొలగించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమన్వయం చేయాల్సిందిగా స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శ్రీనివాస్ (నాని)కి సూచించారు. కొండ మీద చేపట్టే అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ జరిపేందుకు సంబంధిత వ్యక్తులతో సంప్రదించి సత్వరం ఆ పనులను చేపట్టాలని ఇవోను ఆదేశించారు. ఈ సందర్భంలో మహా మండపానికి దారితీసే మార్గాలను పరిశీలించారు. ‘హిల్ వ్యూ’ ప్రాంతం నుండి ప్రకాశం బ్యారేజీని, అమరావతి రాజధాని ప్రాంతాలను వీక్షించేందుకు వీలుగా పనులు చేపట్టాలన్నారు. మొత్తంగా పర్యాటక ప్రాంతంగా ఈ పరిసరాలను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం విజయవాడలో గురువారం పుష్కరఘాట్ పనులను తనిఖీ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు