రాష్ట్రీయం

రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ తరఫున ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణామూర్తి, మంత్రి అచ్చెన్నాయుడు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ విందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రావాల్సి ఉండగా, ఆయన గైర్హాజర్ అయ్యారు. చంద్రబాబు రాకపోవడానికి విజయవాడలో మంత్రిమండలి సమావేశం, ఇఫ్తార్ విందు ఉండటమే కారణమని గవర్నర్ నరసింహన్ వివరించారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాలను పరిష్కరించడానికి జోక్యం చేసుకుంటారా? అని మీడియా ప్రతినిధులు గవర్నర్‌ను ప్రశ్నించగా, తాను కచ్చితంగా ప్రొటోకాల్‌ను పాటించేవాడినంటూ సమాధానం దాట వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇఫ్తార్ శుభాకాంక్షలు తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అన్ని మతాల వారు సుహృద్భావంతో మెలగాలని గవర్నర్ ఆకాంక్షించారు.

chitram... రంజాన్ పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో మాట్లాడుతున్న నరసింహన్. హాజరైన సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయ