రాష్ట్రీయం

ఏది ఎక్కువ.. ఏది తక్కువ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భూనిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. రైతాంగం నష్టపోకూడదన్న ఉద్దేశంతో 123 జీవో తీసుకొచ్చామని చెబుతున్న సర్కారు, రైతులు కోరుకుంటే 2013 కేంద్ర చట్టం ప్రకారమైనా చెల్లించేందుకు సిద్ధమేనంటూ ప్రకటించింది. వాస్తవానికి మార్కెట్ ధరకంటే మూడింతలు పరిహారం చెల్లించాలనేది 2013 భూసేకరణ చట్టంలోని ప్రధాన అంశం. దీని ప్రకారం నిర్వాసితులకు మూడింతలు పరిహారం చెల్లించాలని, అంటే ఎకరాకు కనీసం 8 లక్షలు పరిహారం వస్తుందనేది రైతుల వాదన. మార్కెట్‌లో వ్యక్తులు కొనుగోలు, అమ్మకాలు జరిపే ధర ఎంతవున్నా, చట్టం ప్రకారం మార్కెట్ ధర అంటే రిజిస్ట్రేషన్ ధరే. నిజానికి బహిరంగ మార్కెట్లో భూముల ధరకు, రిజిస్ట్రేషన్ మార్కెట్ ధరకు ఏమాత్రం పొంతన ఉండదు. ఈ వ్యత్యాసమే మల్లన్నసాగర్ భూనిర్వాసితుల పరిహారంలో ప్రధాన సమస్య. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూముల ధరలు రైతులు చెబుతున్నట్టు లక్షల్లో ఉంటే, రిజిస్ట్రేషన్ విలువ మాత్రం ఎకరాకు 60 వేలు మాత్రమే ఉంది. 2013 చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే ఎకరాకు మూడింతలు అంటే 1.8లక్షలు మాత్రమే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123 ప్రకారం తొలుత ఎకరాకు ఐదు లక్షలు పరిహారం చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఆందోళనలు, రైతుల ఉద్యమాలను పరిగణనలోకి తీసుకుని ఎకరాకు ఏడు లక్షలు చెల్లించేందుకు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు సంసిద్ధత వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టం 2013లోని నాల్గవ చాప్టర్, సెక్షన్ 26లో మార్కెట్ ధర అంటే ఏమిటో స్పష్టంగా పేర్కొన్నారు. 1899 ఇండియన్ స్టాంప్స్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ ధరే మార్కెట్ ధర అవుతుంది. మార్కెట్ ధరకు మూడింతలిచ్చినా రైతుకు న్యాయం జరగదనే ఉద్దేశంతో 2014 నవంబర్ 20న ప్రభుత్వం జీవో 389 తీసుకొచ్చింది. దీని ప్రకారం మార్కెట్ ధరపై గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం, గిరిజన ప్రాంతాల్లో 50శాతం అదనంగా మార్కెట్ ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత మార్కెట్ ధర 60 వేలకు 50 శాతం అదనంగా అంటే 30వేలు కలిపినా 90వేలు అవుతుంది. దీంతో 2014 డిసెంబర్ 19న సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు మరో జీవో జారీ చేశారు. దీని ప్రకారం మార్కెట్ ధరను గ్రామీణ ప్రాంతాల్లో 50శాతానికి పైగా, గిరిజన ప్రాంతాల్లో నూరు శాతం అదనంగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారం చూసినా 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి వస్తే ఎకరానికి 1,90,800 లభిస్తుంది. జీవో 123 ప్రకారం ఎకరం 60 వేలు రిజిస్ట్రేషన్ ధరకు పదిరెట్లు పెంచితే 5.85లక్షలు లభిస్తుంది. దీన్ని ఏడు లక్షల వరకు పెంచేందుకు నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అంగీకరించారు. ఇక 2013 చట్టం ప్రకారం ఇళ్లు కోల్పోయిన వారికి 70 వేలు చెల్లించాల్సి ఉండగా, ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించేందుకు అంగీకరించింది.
అయితే నిర్వాసితుల వాదన మరో రకంగా ఉంది. భూమి రిజిస్ట్రేషన్ విలువకు వాస్తవ విలువకు పొంతన లేదని, దీన్ని గుర్తించి తమకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. జీవో 123 ప్రకారం అయినా, 2013 భూసేకరణ చట్టం ప్రకారమైనా తమకు న్యాయం జరగదని అంటున్నారు. వాస్తవ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని నిర్వాసిత రైతులు కోరుతున్నారు. మరోపక్క 123 జీవో ప్రకారం భూసేకరణ నిలుపివేయాలని కోరుతూ మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులు కొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం.