రాష్ట్రీయం

భారీ వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25 : బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దాంతో కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ మేరకు శనివారం ఐఎండి శాస్తవ్రేత్త చరణ్ సింగ్ ఒక ప్రకటన జారీ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతిభారీ వర్షాలు ఉంటాయని, కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమ జిలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని వివరించారు. గత 24 గంటల్లో పాతపట్నం (శ్రీకాకుళం), రామన్నపేట (నల్లగొండ)లలో 8 సెంటీమీటర్లు, జుక్కల్ (నిజామాబాద్)లో 7 సెంటీమీటర్లు, పిట్లంలో 6, బాల్గొండ, కోటగిరిలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, కర్నూలు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, నెల్లూరు తదితర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదైంది.

చిత్రం హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి జలమయమైన రోడ్లు