రాష్ట్రీయం

ఎలా కోరితే అలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సంగారెడ్డి, జూన్ 25: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు న్యాయం చేయాలని ఒకవైపు విపక్షాలు ఆందోళనలు, దీక్షలు చేస్తుంటే, రైతులు కోరుకున్నట్టే పరిహారం చెల్లిస్తామంటూ సిఎం కెసిఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మల్లన్నసాగర్ భూనిర్వాసితుల సమస్యపై సిఎం కెసిఆర్ తొలిసారి స్పందించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణలో రైతుల ప్రయోజనాలు, వారి అభిప్రాయానికి అనుగుణంగానే ప్రభుత్వం పరిహారం అందిస్తుందని సిఎం కెసిఆర్ శనివారం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రస్తుతం రెండు విధానాలు అమల్లో ఉన్నాయని తెలిపారు. 2013లో తెచ్చిన భూసేకరణ చట్టం ఒకటికాగా, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 123 మరొకటని కెసిఆర్ చెప్పారు. రైతులు ఏపద్ధతి ప్రకారం పరిహారం కావాలంటే దాని ప్రకారం అందిస్తామని సిఎం చెబుతున్నారు. జీవో నెంబర్ 123 ప్రకారం కావాలన్న వారికి అదే విధానం ద్వారా, 2013 చట్టం ద్వారా పరిహారం కావాలనుకునే వారికి అదే నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తామని సిఎం తేల్చిచెప్పారు. పాలకపక్షాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ పార్టీలు రైతులకు మద్దతుగా నిలుస్తుండటంతో, ప్రభుత్వం ఒక్క ప్రకటనతో మల్లన్నసాగర్ సీన్ మొత్తం మార్చేసింది. ప్రజలు, భూనిర్వాసితులు కోరుకున్నట్టే పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమని మెదక్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ కూడా ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ భూసేకరణ వివాదానికి తెరదించేలా పలు విషయాలు ప్రకటించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణకు వెంటనే నోటిఫికేషన్ జారీచేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. రైతుల ఆమోదంతోనే భూసేకరణ కొనసాగుతుందని, ఎవరినీ బలవంతం చేయడం లేదన్నారు. కేంద్రం 2013లో ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం ఒకరకమైతే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా 123 జీవో ఉత్తర్వులు మరో రకమంటూ రెండు పద్ధతులను వివరించారు. ఇప్పటివరకు అంగడి కిష్టాపూర్‌లో 145మంది రైతులు స్వచ్చందంగా ముందుకొచ్చి 270 ఎకరాల భూమిని 123 జీవో ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ను చేయించారన్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం 2013లోని కేంద్ర చట్టాన్ని దీనికి వర్తింప చేయాలని నిర్ణయించామన్నారు. ఈమేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని, అనంతరం సంబంధికులకు నోటీసులిచ్చి వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామన్నారు. 2013 చట్టం స్పష్టంగా ఉందని, అందులో జిల్లా యంత్రాంగం తలదూర్చే అవకాశం లేదన్నారు. మార్కెట్ ధర అంటే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ శాఖ నిర్దేశించే ధరమేరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, చట్టంలోని నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జీవో 123 ప్రకారం ఇప్పటి వరకు భూములు అప్పగించిన వారు, తిరిగి 2013 చట్టం ప్రకారం పరిహారం కోరుకుంటే ఆ మొత్తం తక్కువగానే లభిస్తుందని కలెక్టర్ వెల్లడించారు. రైతులు ఈ విషయాన్ని ముందుగానే పరిశీలించుకోవాలని సూచించారు.