రాష్ట్రీయం

ఎన్‌ఎస్‌జి సభ్యత్వంతో ఒరిగేదేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: అంతర్జాతీయ అణు ఇంధన సరఫరాదార్ల బృందం (ఎన్‌ఎస్‌జి) సభ్యత్వం సాధించేందుకు కేంద్రం అంతగా తాపత్రయ పడాల్సిన అవసరం లేదని ప్రముఖ అణు శాస్తవ్రేత్త, అణు ఇంధన సంఘం (ఎఇసి) సభ్యుడు ఎంఆర్ శ్రీనివాసన్ అన్నారు. అణు ఇంధన సరఫరాదార్ల బృందంలో సభ్యత్వం కోసం భారత్ చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ బృందంలో చోటు రావడం వల్ల భారత్‌కు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ అణు ఇంధన సంఘంను కేంద్రం సంప్రదించి ఉంటే, ఈ ప్రయత్నాలు చేయడం మంచిది కాదనే సలహా ఇచ్చి ఉండేవారమన్నారు. అనేక దేశాలతో రియాక్టర్లు, యురేనియంపై భారత్ ఒప్పందం కుదుర్చుకుని ఉందన్నారు.రష్యా, ఫ్రాన్స్, అమెరికాతో రియాక్టర్ ప్రాజెక్టులపై భారత్‌కు ఇప్పటికే ఒప్పందాలు ఉన్నాయన్నారు. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లేకపోయినా, ఇప్పటికే అణు ఇంధనాన్ని సమకూర్చుకోవడంలో భారత్ ముందడుగులో ఉందన్నారు. కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియాతో కూడా భారత్ యురేనియం కొనుగోలు ఒప్పందాలు ఖరారు చేసుకుందన్నారు. దేశంలో అణు ఇంధన సంఘం ఉందని, ఇందులో తాను సభ్యుడినని, తనను అడిగి ఉండి ఉంటే ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం కోసం ప్రయత్నం చేయవద్దని చెప్పేవాడినని తెలిపారు.