తెలంగాణ

మ్యాన్‌హోల్‌కు బలైపోయాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ గచ్చిబౌలి, జూన్ 26: కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ రోడ్డు మధ్య గుంత తవ్వి విడిచి పెట్టడంతో, ప్రమాదవశాత్తూ అందులో పడిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మోతి యాదవ్ (24) మాదాపూర్‌లోని నైట్ బజార్‌లో రాక్ ఇన్ గ్రిల్ హోటల్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మ్యాన్‌హోల్‌లో పడి మృతిచెందాడు. మాదాపూర్‌లోని కాసాని జిఆర్ హోటల్ సమీపంలో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డు తవ్వారు. సాయంత్రం భారీ వర్షం కురియడంతో రోడ్డు మధ్యలో గుంతలు నీటితో కనిపించకుండా పోయాయి. ఆ గుంతలో ఆటో ఇరుక్కుపోవడంతో మోతి యాదవ్ ఆటోను బయటకు నెట్టాడు. ఆటో వెళ్లిపోయిన అనంతరం రోడ్డు దాటుతున్న క్రమంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం తవ్విన మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు. అక్కడ అండర్ గ్రౌండ్ విద్యుత్ సరఫరా ఉండటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మోతి యాదవ్ మృతి చెందాడని స్థానికులు ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.