తెలంగాణ

పుట్టగానే బర్త్ సర్ట్ఫికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ప్రకారం శిశువులకు జనన ధృవీకరణ పత్రాలు స్థానిక సంస్థలు ఉచితంగా జారీ చేయాల్సి ఉంది. కానీ ఈ నిబంధనను జిహెచ్‌ఎంసి ఏ మాత్రం అమలు చేయలేకపోయింది. శిశువు పుట్టగానే బర్త్ సర్ట్ఫికెట్ జారీ చేయటంతో పాటు ఆధార్ కార్డును కూడా సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ శిశు ఆధార్ ప్రాజెక్టుతో చేపట్టనున్న ఈ కొత్త ప్రక్రియను తొలి దశగా 19 ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఇందులో భాగంగానే ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలకు ఆధార్ కార్డు నెంబర్‌ను లింకు చేయాలని కూడా భావిస్తున్నారు. పుట్టిన వెంటనే వివరాలతో ఆన్‌లైన్‌లో బర్త్ సర్ట్ఫికెట్ జారీ చేసి, ఆ తర్వాత ఆధార్ కార్డు ఇవ్వగలిగితే వారు అతి త్వరగా గణాంకాల్లోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. బర్త్ సర్ట్ఫికెట్ ఇవ్వటంతో జనాభాలో చేరి ఈ శిశువులకు ఆధార్ కార్డు మంజూరు చేసి డిజిటల్ లాకర్ పరిధిలోకి తీసుకురావాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య సంకల్పం. అంతేగాక, ప్రభుత్వాసుపత్రుల్లో జన్మించిన వారంతా తమ బర్త్ సర్ట్ఫికెట్‌ను ఆధార్‌తో ఏడు రోజుల్లో అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియతో కొత్తగా జన్మించే శిశువులకు సంక్షేమ, వైద్యారోగ్య రంగాల పరంగా రావల్సిన ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందించే వీలు కలిగే అవకాశాలున్నాయి.