తెలంగాణ

తడిసి ముద్దయన రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 28: ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగకుండా కురుస్తున్న వర్షంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే అనేక చెరువులు అలుగులు పడగా, ఖరీఫ్ సీజన్‌కు అనుకూలమైన వర్షాలు పడ్డాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గడిచిన 24గంటల్లో అత్యధికంగా బూర్గంపాడు మండలంలో 72.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్‌లలో ఒకటైన పెద్దవాగు ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్ళను వదులుతున్నారు. అలాగే పాలేరు, కినె్నరసాని, వైరా రిజర్వాయర్లలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. అలాగే మసివాగు, బుగ్గవాగు, రాళ్ళవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కెటిపిఎస్ 7వ దశ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఉపరితల గనుల్లోకి నీరు రావటంతో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం కలిగింది.
కృష్ణాలో ..
మచిలీపట్నం: జిల్లాలో 16.5మి.మిల సరాసరి వర్షపాతం నమోదైంది. సోమవారం ఉదయం 8.30ని.ల నుండి మంగళవారం ఉదయం 8.30ని.ల వరకు ఈ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. గుడివాడలో 85.6మి.మిల అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కోడూరు మండలంలో 3.0మి.మిలు నమోదైంది. విజయవాడ రూరల్, అర్బన్‌లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేటలో 15.2, వత్సవాయిలో 23.2, పెనుగంచిప్రోలు 24.4, నందిగామలో 13.6, చందర్లపాడులో 5.4, కంచికచర్లలో 10.2, వీరుళ్ళపాడులో 21.8, ఇబ్రహీంపట్నంలో 10.2, జి.కొండూరులో 15.4, మైలవరంలో 33.6, ఎ.కొండూరులో 16.2, గంపలగూడెంలో 29.6, తిరువూరులో 19.2, విస్సన్నపేటలో 15.2, రెడ్డిగూడెంలో 25.2, పెనమలూరులో 8.6, తోట్లవల్లూరు, కంకిపాడులలో 5.8, ఆగిరిపల్లిలో 36.2, నూజివీడులో 18.6, చాట్రాయిలో 22.4, ముసునూరులో 12.2, బాపులపాడులో 12.4, ఉయ్యూరులో 5.0, పమిడిముక్కల, మొవ్వలలో 10.2, ఘంటసాలలో 6.4, చల్లపల్లిలో 7.2, మోపిదేవిలో 4.6, అవనిగడ్డలో 5.2, నాగాయలంకలో 4.0, మచిలీపట్నంలో 20.4 మి.మిలు చొప్పున వర్షపాతం నమోదైంది.
గోదావరి జిల్లాల్లో..
రాజమహేంద్రవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా గోదావరి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అయితే నిరంతరాయంగా కురుస్తుండటంతో అన్ని ప్రాంతాలూ చిత్తడిగా మారాయి. మెట్ట ప్రాంతంలో రైతాంగం వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతుండగా, డెల్టాలో ఇప్పటికే వేసిన వరి నారుమళ్లకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లోని కొండవాగులు మాత్రం పొంగిపొర్లుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలో జల్లివారిగూడెం వాగు పొంగి పొర్లుతూ రహదారిపై ప్రవహిస్తోంది. దీంతో చింతూరు నుండి విఆర్ పురం మండలానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో నేలవాగు ఉద్ధృతికి వేలేరుపాడు-కోయిలా రహదారిలో వంతెన ధ్వంసమయ్యింది.
రాయలసీమలో..
అనంతపురం/కర్నూలు, జూన్ 28: సీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం అనంతపురం, కర్నూలుప జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అత్యధికంగా 28.6 మిమీటర్ల వర్షపాతం కురిసింది. కర్నూలు జిల్లాలో సైతం వర్షాలు కురుస్తున్నాయి. హొళగుంద మండలంలో 19.2 మిమీ అత్యధిక వర్షపాతం నమోదైంది.