రాష్ట్రీయం

పైపులైన్లతో పాటు ఆప్టిక్ ఫైబర్ కేబుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: తెలంగాణలోని గ్రామాల్లో వేస్తున్న అంతర్గత పైప్‌లైన్లతోనే ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేయాలని ఆర్‌డబ్ల్యుయస్ ఇఎన్‌సి బి సురేందర్‌రెడ్డి అన్నారు. దీనికి సంబంధించి అవసరమైన డక్ట్‌లను కొనుగోలు చేయాలని వర్క్ ఏజెన్సీలకు సూచించారు. మిషన్ భగీరథ పనులపై అన్ని జిల్లాల ఎస్‌ఇలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ తెలంగాణ లక్ష్యానికి అనుగుణంగా ఫైబర్ పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ముందుగా హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పరిధిలోని తొమ్మిది నియోజక వర్గాల్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతిని పరిశీలించారు. అటవీ అనుమతులు పొందే విషయంలో మరింత వేగం పెంచాలని అన్నారు. మిషన్ భగీరథలో కొన్ని ప్రాంతాల్లో సోలార్ పంపు సెట్లతో నీటిని సరఫరా చేయనున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు వినియోగించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం అమలు సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చూపించే ప్రభావాలపై సర్వే జరుగుతోందని తెలిపారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్లు సురేష్ కుమార్, జగన్మోహన్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.