రాష్ట్రీయం

నిర్వాసితులకు తేలని ప్యాకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 3: రాజధాని అమరావతి యాక్సిస్ రోడ్డు నిర్వాసితులకు ప్రభుత్వం ఇప్పటికీ ప్యాకేజీ ప్రకటించకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వెంకటపాలెం మొదలు కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, పెనుమాక, తుళ్లూరు వరకు 21 కిలోమీటర్ల పరిధిలో యాక్సిస్ రోడ్డు ఏర్పాటు కానుంది. రూ. 235 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారి పనులను నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది. సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం యాక్సిస్ రోడ్డు కారణంగా మూడువేల వరకు నివాసాలను తొలగించాల్సి ఉంది. వేలకొద్దీ కట్టడాలను కూల్చితే వ్యతిరేకత వ్యక్తమవుతుందనే భావనతో మాస్టర్‌ప్లాన్‌లో సవరణలు తీసుకొచ్చింది. ప్లాన్‌లో ప్రతిపాదించిన డిజైన్ కంటే వంద మీటర్లు గ్రామాల శివార్ల మీదుగా రహదారి ఏర్పాటయ్యే మార్గాలను అనే్వషించి ఎట్టకేలకు డిజైన్లలో మార్పులు చేశారు. ఈ రహదారిలో మూడు ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతుంది. ఉండవల్లి నుంచి మొదలయ్యే ఈ మార్గం కనకదుర్గమ్మ వారధికి సమీపంలో జాతీయ రహదారి 16తో అనుసంధానం చేస్తారు. ఇదే మార్గంలో స్ప్రింగ్ వంతెన నిర్మాణం కూడా ప్రతిపాదనలో ఉంది. సవరించిన డిజైన్ల ప్రకారం 350 ఇళ్లను మాత్రమే తొలగించాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా అంతకు మూడింతల భవనాల కూల్చివేత తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. యాక్సిస్‌రోడ్డులో ఇళ్లను తొలగించే గ్రామాలన్నీ సచివాలయం, సీడ్ కాపిటల్‌కు చేరువలో ఉన్నవే. యాక్సిస్‌రోడ్డుతో పాటు మేజర్ ఆర్టీరియల్, మైనర్ ఆర్టీరియల్, కలెక్టర్ రోడ్ల నిర్మాణంలో కూడా మరికొన్ని భవనాలను కూల్చాల్సి ఉంటుంది. రహదార్ల ఏర్పాటులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీపై అస్పష్టత నెలకొంది. ఉండవల్లి, ఎర్రబాలెం, పెనుమాక, కిష్టాయపాలెం, మందడం గ్రామాల్లో కొన్ని నివాసాలను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో నెలరోజుల్లో సచివాలయానికి ప్రధాన మార్గంగా రూపుదిద్దుకోనున్న ఈ రహదారి కారణంగా ఇళ్లు కోల్పోయే వారికి రాజధాని ల్యాండ్ పూలింగ్ రైతులకిచ్చిన ప్యాకేజీకి ధీటుగా తిరిగి నివాసాలు ఈ ప్రాంతంలోనే నిర్మించుకునేందుకు వీలుగా అందించాలని గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.