రాష్ట్రీయం

జల వివాదంపై త్రిసభ్య కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకంపై తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్‌గా కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబి పాండ్యాను నియమించారు. ఈ కమిటీలో కేంద్ర జల సంఘం సీనియర్ ఇంజనీర్లు ఏకె బజాజ్, సురేష్ చంద్రను సభ్యులుగా నియమించారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిని కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ ఆయకట్టు, రాయలసీమకు విడుదల చేసే విషయమై ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను కృష్ణా బోర్డు కూడా పరిశీలించి తన నిర్ణయం తెలియచేస్తుంది. ఈ కమిటీ వచ్చే వారంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటిస్తుంది. కృష్ణా బోర్డు చేసిన సిఫార్సులను అధ్యయనం చేసి తుది నివేదికను కేంద్ర జలవనరుల శాఖకు సమర్పిస్తుంది. ఇటీవల కృష్ణా నది యాజమాన్య బోర్డు మొత్తం ప్రాజెక్టుల నిర్వహణను తమ ఆధీనంలోకి తేవాలని సిఫార్సు చేసింది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ తీవ్రం గా వ్యతిరేకించిన విషయం విదితమే. పైగా ఈ సిఫార్సులన్ని ఆంధ్ర ప్రభుత్వం ఒత్తిడితో చేశారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. దీని వల్ల బోర్డు కార్యదర్శి గుప్తాపై వేటు పడిన సంగతి తెలిసిందే.