రాష్ట్రీయం

వెలుగులన్నీ మనకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: విద్యుత్ రంగంలో ఆంధ్ర పంట పండింది. నవ్యాంధ్రగా అవతరించిన రెండేళ్లలోనే మిగులు విద్యుత్ సాధించిన ఏపికి కొవ్వాడలోప్రతిపాదిత అణు విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తిలో సగం విద్యుత్‌ను కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్రానికి కేంద్రం తెలియచేసింది. ఈ విద్యుత్‌ను చాలా చౌకగా ఏపికే విక్రయించనుంది. శ్రీకాకుళం జిల్లా రణ స్ధలం వద్ద నిర్మించనున్న అణు విద్యుత్ ప్లాంట్‌కు 2,475 ఎకరాలను సేకరించే ప్రక్రియ వేగవంతమైంది. భూసేకరణ, పునరావాసానికి రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఎన్‌పిసిఎల్ ఇంతవరకు రూ.500 కోట్ల వరకు నిధులను రాష్ట్రప్రభుత్వానికి చెల్లించింది. నష్టపరిహారం కిందనే రూ. 940 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం ఎన్‌పిసిఎల్‌కు ఇచ్చిన నివేదికలో గతంలోనే పేర్కొంది.న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ 1,594 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ఆరు అణు రియాక్టర్లను నెలకొల్పనుంది. మొదటి రియాక్టర్ నిర్మాణం 2018కు పూర్తయ్యే అవకాశం ఉందని ఎన్‌పిసిఎల్ అధికారులు తెలిపారు. కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి మొత్తం లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఒక మెగావాట్ ఉత్పత్తికి దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్‌వి రమేష్ తెలిపారు. ఒక యూనిట్ విద్యుత్ నాలుగు రూపాయలకు సరఫరా చేస్తారు. అమెరికాకు చెందిన వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ ఏపి-1000 అణు రియాక్టర్లను కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్‌కు సరఫరా చేసేందుకు అంగీకరించింది. చైనా, అమెరికాలో అణు విద్యుత్ ప్లాంట్లకు ఇదే డిజైన్ పరికరాలను ఉపయోగిస్తున్నారు.