ఆంధ్రప్రదేశ్‌

కృష్ణా పుష్కరాలకు ‘గోదావరి’ జలాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 6: పవిత్ర కృష్ణానదిలో త్వరలో జరగనున్న పుష్కరాల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కృష్ణా, గుంటూరు జిల్లాల వాసులు చరిత్రలోనే తొలిసారిగా గోదావరి జలాలతో స్నానమాచరించే దుస్థితి రాబోతోంది. అసలు ఏడాది కాలంగా కృష్ణా జలాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువకు చెప్పుకోదగిన రీతిలో వచ్చిన దాఖలాలు లేవు. గత నెల 20న అదీ కృష్ణా డెల్టాల మంచినీటి అవసరాల కోసం కేవలం రెండు టిఎంసిల నీరు వదిలితే ఆవిరైపోయిన దిశగా చేరువైంది నామమాత్రమే. ఏడాది పొడవునా 12 అడుగుల నీటి మట్టంతో కళకళలాడాల్సిన ప్రకాశం బ్యారేజీ ముందెన్నడూ లేనివిధంగా మూడు అడుగులకు దిగజారినప్పుడే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు. దీనికితోడు కృష్ణా డెల్టా పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం , ప.గో జిల్లాల్లో విస్తరించిన 13 లక్షల ఎకరాల ఆయకట్టులో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు కనీసం 80 టిఎంసిల నీరు అవసరమవుతుంది. కృష్ణా నీరు చుక్క రాదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇదే సమయంలో పట్టిసీమ పథకం ద్వారా 100 టిఎంసిల గోదావరి జలాలతో ఆ లోటును పూరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుబుధవారం లాంఛనంగా మోటార్లను ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లో ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి చేరడం ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి ముద్దుగా ‘పవిత్ర సంగమం’ పేరు నామకరణం చేశారు. పురాణాల్లో ఒక్క కృష్ణా జిల్లాలోనే నదీ తీరాన 60 తీర్థాలున్నాయి. అయితే రేపో మాపో ఈ తీర్థాలన్నీ గోదావరి జలాలతోనే నిండిపోనున్నాయి. అంతేగాక సమీప అమరావతి వరకు ఈ గోదావరి జలాలు వెనక్కి వెళ్లనున్నాయి.
అసలు కృష్ణా పుష్కరాల్లో గోదావరి జలాలలో స్నానం ఏమిటనే ప్రశ్న ఇపుడిపుడే ప్రజల్లో ఎదురవుతోంది. అందరికంటే ముందు విశాఖ పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర స్వామి ఈ పరిణామాలన్నింటినీ గుర్తించారు. సహజ సిద్ధమైన కృష్ణానదిని అందునా చారిత్రక కృష్ణా పుష్కర సమయాల్లో గోదావరి జలాలతో నింపి పుష్కరాల సమయంలో ఆ పవిత్రతను పోగొట్టవద్దంటూ రెండు మాసాల క్రితమే స్వామీజీ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్‌వి ప్రసాద్‌కు లేఖ రాశారు. కనీసం పుష్కరాల సమయంలో అయినా సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేసేందుకు ఎగువనున్న కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని కూడా స్వామీజీ సూచించారు. అయితే ఈ లేఖకు నేటివరకు సమాధానం లేదు..
ప్రస్తుతం సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణానదిలో కన్పించే నీటిలో కూడా కృష్ణా జలాలు నామమాత్రమే. తెలంగాణ, గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి కీసర, మూసీ, మునేరు, పాలేరు, కట్టలేరు, వైరా తదితర వాగులు, వంకల నుంచి వచ్చి చేరిన నీరు మాత్రమే..
రిజర్వాయర్ల పరిస్థితి
కృష్ణానదిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాధారణ నీటి మట్టం 590 అడుగులు కాగా గత ఏడాది ఇదే సమయంలో 512 అడుగులు ఉంటే ప్రస్తుతం 504 అడుగులు మాత్రమే ఉంది. ఎగువనున్న శ్రీశైలం ప్రాజెక్టు సాధారణ నీటిమట్టం 885 అడుగులు కాగా గత ఏడాది 802 అడుగులు. అయితే ప్రస్తుతం 786 అడుగులు మాత్రమే ఉంది. రాష్ట్రంలోని ఈ రెండు ప్రాజెక్టుల స్థితిగతులను చూస్తేనే కృష్ణా జలాలు దిగువకు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి భక్తుల మనోభావాలను గుర్తెరిగి ఎగువ రాష్ట్రాలతో చర్చలు ప్రారంభిస్తే బాగుంటుంది.