ఆంధ్రప్రదేశ్‌

అనంతలో ఎన్‌ఐఏ దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 6: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కుట్ర భగ్నం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) విచారణను వేగిరం చేసింది. అందులో భాగంగా దర్యాప్తు బృందం బుధవారం అనంతపురం నగరంలోని ఓ లాడ్జిలో సోదాలు నిర్వహించింది. దాడికి ముందు తాము అనంతపురంలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు ఉగ్రవాదులు వెల్లడించడంతో ఆ దిశగా ఎన్‌ఐఎ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. అదుపులో ఉన్న ఉగ్రవాదుల్లో ఒకరిని బుధవారం ఉదయం రహస్యంగా అనంతపురం తీసుకొచ్చిన బృందం నగరంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న నంది రెసిడెన్సీ లాడ్జిలో సోదాలు జరిపింది. ఈ లాడ్జిలోనే తాము బసచేసినట్లు ఉగ్రవాది చెప్పడంతో హోటల్ యజమాని, బాయ్‌లను బృందం విచారించింది. గది తీసుకోవడానికి ఐడి ప్రూఫ్‌గా ముష్కరుల్లో ఒకరు రిజ్వాన్ పేర ఉన్న ఓటరు కార్డు అందజేసినట్లు తెలుసుకుని దాని నకలు కాపీని స్వాధీనం చేసుకుంది. లాడ్జిలోని లాగ్‌బుక్ (పేర్లు నమోదు చేసే పుస్తకం), ఓటరు ఐడి కార్డు కాపీలను స్వాధీనం చేసుకుంది. కాగా మే నెల చివరి వారంలో 202 నెంబరు గదిలో ఉగ్రవాదులు బస చేసినట్లు తెలుసుకుని ఆ గదిని క్షుణ్ణంగా సోదా చేసింది. వీరు ఒక్క రోజు మాత్రమే గది అద్దెకు తీసుకున్నట్లు లాడ్జి నిర్వాహకులు అధికారులకు చెప్పినట్లు సమాచారం. పూర్తి వివరాలు సేకరించిన ఎన్‌ఐఎ బృందం ఉగ్రవాదిని వెంటబెట్టుకుని తిరిగి హైదరాబాద్ వెళ్లినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా అనంతపురంలోని లాడ్జిలో బసచేసిన ఉగ్రవాదులు తర్వాత ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నారు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, స్థానికంగా ఎవరి సహాయం తీసుకున్నారు అన్న విషయాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా రెండు నెలల క్రితం ఇద్దరు ఉగ్రవాదులు అనంతపురం నగరంలోని నంది లాడ్జిలో బస చేసినట్లు నిర్ధారణ కావడం, దర్యాప్తు బృందం ఉగ్రవాదిని వెంటబెట్టుకుని లాడ్జిలో సోదాలు నిర్వహించినట్లు తెలుసుకున్న నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.