ఆంధ్రప్రదేశ్‌

భారీస్థాయిలో గృహ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 6: రాష్ట్రంలోని బ్యాంకులు ఈ ఏడాది గృహ రుణాలను భారీ స్థాయిలో ఇవ్వనున్నాయి. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు, రాష్టస్థ్రాయి బ్యాంకింగ్ కమిటీలు రూపొందించిన రాష్ట్ర రుణ ప్రణాళిక తాత్కాలిక అంచనాలను ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది (2015-16) రుణ ప్రణాళికలో గృహ రుణాలకు రూ.5163 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అంటే 132 శాతం పెరుగుదల కనిపిస్తోంది. నూతన రాజధాని అమరావతి పరిధిలో నిర్మాణాలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా కేటాయించారు. మొత్తం రుణ ప్రణాళికలో కూడా 31 శాతం పెరుగుదల కనిపిస్తోంది. గత ఏడాది రాష్ట్ర రుణ ప్రణాళిక లక్షా 25 వేల 748 కోట్ల రూపాయలు కాగా, ఈ ఏడాది లక్షా 64 వేల 615 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. అలాగే ఈసారి అప్రాధాన్యత రంగాలకు కూడా 39 శాతం పెంచారు. ప్రాధాన్యతా రంగాలకు గత ఏడాది రూ.96,920 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 29 శాతం పెంచి, లక్షా 24 వేల 615 కోట్ల రూపాయలు కేటాయించారు. రంగాలవారీగా గత ఏడాది ఈ ఏడాది తాత్కాలిక అంచనా రుణ కేటాయింపులను పరిశీలిస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.16 వేల 960 కోట్ల నుంచి 22 వేల కోట్ల రూపాయలకు పెంచారు. ఆ తరువాత వ్యవసాయం, దాని అనుబంధంగా ఇచ్చే రుణాలను 28 శాతం పెంచారు. రూ.17,205 కోట్ల నుంచి 22వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.ఈ ఏడాది అదనంగా కొత్తగా మూడు రంగాలకు రుణాలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎగుమతులకు సంబంధించి రూ.200 కోట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి)కి వంద కోట్లు, సామాజిక రంగానికి వంద కోట్ల రూపాయలు కేటాయించారు.
ప్రాధాన్యతా రంగాలలో గత ఏడాది ఇచ్చిన రుణాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాలలో ఏడు జిల్లాలలో లక్ష్యాలకు మించి రుణాలు ఇచ్చారు. 126 శాతం లక్ష్యాలను సాధించి అనంతపురం జిల్లా మొదటిస్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో ప్రకాశం జిల్లా ఉంది. ఆరు జిల్లాలలో రాష్ట్ర సరాసరికంటే తక్కువగా రుణాలు ఇచ్చారు. 75 శాతం లక్ష్యాలను మాత్రమే పూర్తి చేసి విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. రాష్ట్రంలో బ్యాంకులు ప్రాధాన్యతా రంగాలకు లక్ష్యానికి మించి 107 శాతం రుణాలు అందజేశాయి. అనంతపురం జిల్లా 138 శాతం లక్ష్యాలు సాధించి మొదటిస్థానంలో నిలవగా, 127 శాతం లక్ష్యాలు సాధించి చిత్తూరు ద్వితీయ స్థానంలో నిలిచింది. 87 శాతం మాత్రమే పూర్తి చేసి విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగంలోప్రకాశం (137 శాతం), వైఎస్‌ఆర్ కడప జిల్లా (129 శాతం)లు 1, 2 స్థానాలలో నిలిచాయి. చిత్తూరు జిల్లా 38శాతం లక్ష్యాలను మాత్రమే పూర్తి చేసి చివరిస్థానంలో ఉంది. ఇక లబ్ధిదారుల పరంగా పరిశీలిస్తే అన్ని రంగాలలో కోటి 8 లక్షల 91 వేల 385 మందికి రుణాలు అందజేయాలని లక్ష్యం కాగా రాష్ట్రంలో బ్యాంకులు 80 లక్షల 33వేల 477 మందికి రుణాలు ఇచ్చి 74 శాతం లక్ష్యాన్ని సాధించాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాలు వరుసగా 156 శాతం, 147 శాతం లక్ష్యాలను సాధించి మొదటి రెండు స్థానాలలో నిలిచాయి.