తెలంగాణ

హైదరాబాద్‌లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 6: హైదరాబాద్‌లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ అధికారులు అప్రమత్తమై అడ్డుకున్నారు. ఎన్‌ఐఏ అప్రమత్తతో నగరానికి ముప్పు తప్పింది. ఓవైపు రంజాన్, మరో వైపు బోనాల సీజన్ నేపథ్యంలో ఉగ్ర కదలికలు వణుకు పుట్టిస్తున్నాయ. దీంతో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. బుధవారం అడుగడుగునా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, సికిందరాబాద్ రైల్వే స్టేషన్లలో సిఆర్‌పిఎఫ్ భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించాయ. శంషాబాద్ విమానాశ్రయంతోపాటు నగరంలోని ప్రధాన ఆలయాలు, మసీదులు, షాపింగ్ మాల్స్ వద్ద పెద్దఎత్తున భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయ. గురువారం రంజాన్ సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు నగర కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. పాతబస్తీలో గస్తీ ముమ్మరం చేశారు. చార్మినార్, జామా మసీదు, భాగ్యలక్ష్మి ఆలయం, మదీన వద్ద ప్రత్యేక దళాలు మోహరించాయి. ఇదిలావుండగా గత గురువారం హైదరాబాద్‌లో ఐదుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తరువాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఐసిస్ ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ, హైదరాబాద్ పోలీసులు చేపట్టిన దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇటీవల ఎన్‌ఐఏ కస్టడీకి ఇచ్చిన ఐదుగురు ఉగ్రవాదులను విచారణ జరుపుతుండగా వారి సమాచారం మేరకు ఆయుధాల కొనుగోలు, ఐసిస్ చీఫ్‌తో సంభాషించిన మీ-సేవలో సోదాలు నిర్వహించి కీలక సమాచారం రాబట్టారు. తాజాగా అనంతపురంలోనూ ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. బస్టాండ్ సమీపంలోని నంది రెసిడెన్సీలో సోదాలు నిర్వహించి, ఒక లాడ్జి నుంచి ఉగ్రవాదుల ఐడి ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్‌తోపాటు మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

చిత్రం... గోల్కొండ ఫోర్ట్‌లో
డాగ్ స్క్వాడ్ తనిఖీలు