తెలంగాణ

గాంధీభవన్‌లో కూర్చుంటే అధికారం రాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: ‘గాంధీ భవన్‌లో కూర్చుంటే పార్టీ అధికారంలోకి రాదు, ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజాపోరాటాలు చేయండి’ అని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్ పార్టీ నేతలకు హితవు చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. శుక్రవారం గాంధీభవన్ ఆవరణలోని ప్రకాశం హాలులో పార్టీ మున్సిపల్ చైర్మన్లకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతికి దిగ్విజయ్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాయంత్రం శిక్షణ తరగతి ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ పార్టీ బలోపేతం కావాలంటే గాంధీ భవన్‌లో కూర్చుంటే సరిపోదని, ప్రజల్లోకి వెళ్ళాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాడాలని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై కోర్టుకు వెళ్ళాలన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ను వీడి వెళ్ళిన వారి గురించి మరిచి పోవాలని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిద్దామని అన్నారు. ఒకవేళ ఎన్నికలకు ముందు ఫిరాయింపుదారులు మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ఉత్సాహం కనబరిచినా వారిని రానీయబోమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎఐసిసి నాయకుడు ఆర్‌సి కుంతియా, టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు.