రాష్ట్రీయం

సేవలకు సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 11: ఒక పని చేయాలంటే కొన్ని పనులు నిలిపివేయాల్సిందేనా! ప్రభుత్వ తీరు చూస్తుంటే అలానే అన్పిస్తోంది. ప్రజా సాధికార సర్వే (స్మార్ట్‌పల్స్ సర్వే) పేరిట ప్రభుత్వం చేస్తున్న ప్రయోగంతో పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఉద్యోగులంతా సర్వే పనుల్లో మునిగితేలుతున్నారు. రెవెన్యూ, సాధారణ పరిపాలన, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ఒకటేమిటి అన్ని శాఖల్లోనూ పనిచేసే వారే కరువయ్యారు. రాష్ట్రంలోని కుటుంబాల పూర్తి సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నెల 8 నుంచి ప్రజా సాధికార సర్వేను ప్రారంభించింది. ఆగస్టు నెల వరకూ ఈ సర్వే కొనసాగుతుంది. సాధికార సర్వే నిమిత్తం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్లోని 33వేల మంది సిబ్బందితో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కూడా నియమించారు. ప్రతి ఎన్యుమరేటర్ రోజుకు 14 కుటుంబాల వివరాలను సేకరించి, వాటిని క్రోడీకరించాల్సి ఉంది. ఎన్యుమరేటర్లు దాదాపు 40 రోజులపాటు కార్యాలయ విధులకు దూరంగా ఉంటారు. సర్వే మొదలై మూడు రోజులు గడుస్తుండగా, సామాన్య ప్రజానీకానికి సర్వే ఇబ్బందులు అనుభవంలోకి వస్తున్నాయి. సర్వే ప్రారంభమైన తరువాత రెండు రోజులు ప్రభుత్వ సెలవుదినాలు కావడంతో కార్యాలయాలు పనిచేయవని సరిపెట్టుకున్న ప్రజానీకం సోమవారం కూడా ఆఫీసులు తెరుచుకోకపోవడంతోకారణం తెలియక అయోమయానికి గురయ్యారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, మున్సిపల్, అటవీ, విద్యా విభాగాల్లో కొన్ని ప్రాంతీయ కార్యాలయాలు అసలు తెరచుకోనే లేదు. కారణమేమిటని ఆరాతీస్తే సిబ్బంది మొత్తం సాధికార సర్వేకు తరలించారని తెలిసి విస్తుపోవడం ప్రజల వంతైంది. విశాఖ నగర పరిధిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఎనిమిది కార్యాలయాల్లో సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీనిపై సంబంధిత డిఐజి సరోజినిని వివరణ కోరగా సిబ్బంది మొత్తం సర్వేకు వెళ్లిపోవడంతో కార్యాలయాల్లో సేవలను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్‌ను మినహాయింపుకోరామని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రం అంతటా నెలకొందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.

చిత్రం.. సాధికార సర్వే నేపథ్యంలో కార్యాలయ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు పెందుర్తి సబ్‌రిజిస్ట్రార్
కార్యాలయం నోటీస్ బోర్డులో సోమవారం పెట్టిన ప్రకటన