జాతీయ వార్తలు

యుపి లోకాయుక్తగా వీరేంద్ర సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/లక్నో, డిసెంబర్ 16: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తన ఆదేశాలను పాటించకపోవడంతో సుప్రీంకోర్టు రాజ్యాంగపరంగా తనకున్న అధికారాలను ఉపయోగించుకుని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్ర సింగ్‌ను రాష్ట్ర లోకాయుక్తగా బుధవారం నియమించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సైతం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
లోకాయుక్తను నియమించడానికి సుప్రీంకోర్టు విధించిన గడువులోగా లోకాయుక్తను నియమించడానికి రాష్ట్రప్రభుత్వం రెండు దఫాలు సుదీర్ఘ చర్చలు జరిపినప్పటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ముగ్గురు సభ్యుల సెలెక్షన్ కమిటీ నిన్న అర్ధరాత్రి దాకా దాదాపు అయిదు గంటల సేపు చర్చలు జరిపినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో బుధవారం ఉదయం మరోసారి లక్నోలోని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నివాసంలో సమావేశమైంది. రెండు గంటలపాటు జరిగిన ఆ సమావేశంలో సైతం లోకాయుక్తగా ఎవరిని నియమించాలనే దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. లోకాయుక్త నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కోర్టుకు ఒక నివేదికను సమర్పించాల్సి ఉంది.
దీంతో సుప్రీంకోర్టు లోకాయుక్తకోసం తుది వడపోత తర్వాత ఖరారు చేసిన అయిదుగురి పేర్ల జాబితానుంచి అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి వీరేంద్ర సింగ్‌ను లోకాయుక్తగా నియమిస్తున్నట్లు ప్రకటిస్తూ, తమ ఆదేశాలను పాటించడానికి సంబంధించి ఈ నెల 20 నాటికల్లా ఒక నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు పాటించకపోవడం విచారకరం, దిగ్భ్రాంతికరం’ అని జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. తాము రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తమకున్న అధికారాలను ఉపయోగించుకుని తగిన ఆదేశాలను జారీ చేయడం ద్వారా ఈ పరిస్థితిని పరిష్కరిస్తున్నామని బెంచ్ పేర్కొంది. ప్రభుత్వం అయిదుగురు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసినప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోయిందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ చెప్పడం పట్ల ఉదయం బెంచ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యాహ్నం పనె్నండున్నర గంటలకల్లా ఆ జాబితాను సమర్పించాలని ఆయనను ఆదేశించింది.

రాజేంద్రకుమార్‌ను
ప్రశ్నించిన సిబిఐ
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్‌ను బుధవారం సిబిఐ ప్రశ్నించింది. అవినీతి ఆరోపణలు రావడంతో కుమార్ ఆఫీసులో సిబిఐ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ప్రిన్సిపల్ సెక్రెటరీకి చెందిన 14 ప్రాంతాల్లో సిబిఐ తనిఖీలు నిర్వహించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన కార్యాలయంపై సిబిఐ దాడులు చేసిందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొనడం, సిబిఐ దాన్ని తోసిపుచ్చింది. తన అనుమతి లేకుండా తన వద్ద పనిచేస్తున్న అధికారి ఆఫీసులో సోదాలు చేయడమేమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తన కార్యాలయంలో ఫైళ్లను తనిఖీ చేస్తుండగా మీడియా ప్రతినిధులు రావడంతో వెళ్లిపోయారని కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ సిఎం ఆరోపణలను ఖండించారు. అయితే ఢిల్లీ సచివాలయం నుంచి సిబిఐ అధికారులు తీసుకెళ్లిన ఫైళ్ల వివరాలు అప్‌లోడ్ చేశారు. ఇలా ఉండగా రాజేంద్ర కుమార్‌ను బుధవారం సిబిఐ ప్రశ్నించింది. 28 లక్షల విలువైన బ్యాంక్ బ్యాలెన్స్‌లకు సంబంధించి డాక్యుమెంట్లు దొరికాయని సిబిఐ ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. కుమార్ ప్రైవేటు కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టడంలో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.