ఆంధ్రప్రదేశ్‌

జాతి భవిష్యత్ అవసరాల కోసమే మార్కోస్ కమాండో ఫోర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 12: జాతి భవిష్యత్ అవసరాల దృష్ట్యా భద్రత ప్రాధాన్యత పెరింగిందని, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే మార్కోస్ కమాండో ఫోర్సు అవసరమని నౌకాదళ ప్రధానాధికారి అనీల్ లాంబ పేర్కొన్నారు. తూర్పు నౌకాదళం కేంద్రంగా ఐఎన్‌ఎస్ కర్ణ (మార్కోస్ ఈస్ట్)ను విశాఖలో మంగళవారం ఆయన ప్రారంభించారు. దేశంలోనే రెండో కమాండో ఫోర్సుగా మార్కోస్ ఈస్ట్ రక్షణ సేవల్లో నిమగ్నమయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రయోజనాలు, భద్రత లక్ష్యంగా మార్కోస్ కమాండోస్ పనిచేస్తారన్నారు. సుమారు మూడు దశాబ్ధాల కిందట మార్కోస్ యూనిట్‌ను ప్రారంభించగా లక్ష్యానికి మించి సామర్థ్యాన్ని నిరూపించుకుందన్నారు. గగనతలంలోను, భూమిపైన, సముద్రంలోను ఆపరేషన్ నిర్వహించగల సమర్ధ విభాగంగా కొనియాడారు. 1987లో తొలి సారిగా మార్కోస్‌ను ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకూ నిర్వహించిన ఆపరేషన్లలో మార్కోస్ అద్భుత పనితీరును ప్రదర్శించిందన్నారు. భవిష్యత్ రక్షణ అవసరాల నేపథ్యంలో మార్కోస్ ఈస్ట్‌ను ప్రారభించేందుకు నిర్ణయించామన్నారు. ప్రపంచం గర్వించే స్థాయికి తక్కువ సమయంలోనే ఎదిగిందన్నారు. పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులను దక్కించుకుందన్నారు. మార్కోస్ ఈస్ట్ 24 మంది అధికారులు, 320 మంది నావికులు, 12 మంది ఇతర ప్రతినిధులతో స్వతహాగా వ్యవహరిస్తుందని వివరించారు. ఇక భారత రక్షణ రంగంలో కీలకమైన నౌకాదళం తన పాత్రను మరింత విస్తృత పరచుకునే దిశగా ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్‌లో భారత నౌకాదళం అంతర్జాతీయంగా కీలకం కానుందని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు నేవీ చీఫ్ అనీల్ లాంబ సతీమణి రీనా లాంబ మార్కోస్ ఈస్‌కు ఐఎన్‌ఎస్ కర్ణగా నామకరణం చేశారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి హెచ్‌సిఎస్ బిస్త్ మాట్లాడుతూ మార్కోస్ కమాండో ఫోర్సు కౌంటర్ టెర్రరిజం, అంతర్గత పరిస్థితులతో పాటు విపత్తుల సమయంలో సేవలందించేందుకు సిద్ధం గా ఉంటుందన్నారు. అద్భుత పోరాటపటిమ కలిగిన ఈ కమాండో దళం దేశ రక్షణలో కీకలపాత్ర పోషిస్తుందన్నారు. అనంతరం ఐఎన్‌ఎస్ కర్ణ (మార్కోస్ ఈస్ట్) ప్రధానాధికారి కెప్టెన్ వరుణ్ సిం గ్‌ను నేవీ చీఫ్ అనీల్ లాంబ, సతీమణి రీనా లాంబ అభినందించారు. అంతకు ముందు నౌకాదళం ప్రధానాధికారి అనీల్ లాంబకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.

సైలర్ల గౌరవ వందనం స్వీకరించారు.