ఆంధ్రప్రదేశ్‌

రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: అత్యాధునిక శాస్త్ర సాంకేతక ఆరోగ్యకర సమాజాన్ని స్థాపించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చెబుతున్నా, రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రేషనలైజేషన్ పేరుతో ప్రతి జిల్లాలో పాఠశాలలను మూసివేయడంతో డ్రాపవుట్ల సంఖ్య పెరుగుతోంది. గతంలో ప్రతి జనావాసానికి పాఠశాల ఉన్న సమయంలోనే విద్యార్థులు స్కూలు బయట గడుపుతుండగా, చాలా జనావాసాల్లోని స్కూళ్లు లేక విద్యార్థులు మరింత ఇబ్బంది పడుతున్నారు. చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాలు క్రమబద్ధీకరణలో ఉన్న ఇబ్బందులను ప్రభుత్వానికి వివరించినా పట్టించుకునే నాధుడే కరవయ్యాడు. మరో పక్క ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మీడియం స్కూళ్లను ప్రారంభించినా సరిపడా ఆంగ్లబోధనా ఉపాధ్యాయులు లేకపోవటం మరీ సమస్యగా మారింది. సియం గతంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాసు రూమ్‌లు, ల్యాబ్‌లు, లైబ్రరీ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పినా అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. మరోపక్క కంప్యూటర్లు ఏర్పాటు చేసిన స్కూళ్లలో కంప్యూటర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ఆ లక్ష్యాలు కూడా నెరవేరడం లేదు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నా వారి సేవలను వాడుకోక పోవడంతో నిరుపయోగం అవుతోంది. ఉపాధ్యాయులను క్లాసురూమ్ పనికే వినియోగించాల్సి ఉన్నా బోధనేతర పనులకు ఉపయోగించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇంకో పక్క మున్సిపల్ స్కూళ్ల జోక్యం మితిమీరడం కూడా ఉపాధ్యాయుల్లో ఆగ్రహానికి తావిస్తోంది. ఈ సమస్యలపై ఎన్నిమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోతోందని, 14న విజయవాడలో మహార్యాలీ నిర్వహించ తలచినట్టు ఎపి యుటిఎఫ్ నేతలు ఐ వెంకటేశ్వరరావు, పి బాబురెడ్డి, నర్సింహుడు తెలిపారు. రానున్న రోజుల్లో దశల వారీ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే వరకూ వదిలిపెట్టేది లేదని వారు స్పష్టం చేశారు.