రాష్ట్రీయం

నేడు ఢిల్లీకి సిఎం కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రాల మధ్య సంబంధాలు, అంతర్గత భద్రత, సామాజిక, ఆర్థికాభివృద్ధిపై ప్రణాళికలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 16న జరుగనున్న ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి సిఎం కెసిఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సమావేశం అనంతరం శనివారం ప్రధానితో సిఎం ప్రత్యేకంగా భేటీ కానున్నట్టు అధికార వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో ప్రధాని దృష్టికి తీసుకొచ్చే అంశాలను గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు కెసిఆర్ వివరించారు. హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపునకై రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనను ప్రధాని దృష్టికి సిఎం తీసుకెళ్లనున్నట్టు తెలిసింది.
అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులో జరుగుతున్న వివాదంతోపాటు ఈ నెల మూడవ వారంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో గోదావరిపై నిర్మించబోయే ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఒప్పందాలను కూడా ప్రధానికి సూచనప్రాయంగా వెల్లడిస్తారని తెలిసింది. అలాగే విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాల నెలకొల్పుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రధానిని ముఖ్యమంత్రి కోరనున్నారని తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రధానిని కోరనున్నారని తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే. గతంలో కూడా ప్రధాన మంత్రిని స్వయంగా కోరిన తర్వాతనే రాజీవ్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం మూడు నెలలు పొడిగించింది. అలాగే మరోసారి మూడు నెలల పాటు పదవీకాలాన్ని పెంచాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయనున్నారని తెలిసింది.
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న ఎపి భవన్ స్థలాన్ని తమకే పూర్తిగా కేటాయించాలని కోరుతూ కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రధాన మంత్రితో జరిగే భేటీలో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారని తెలిసింది.

చిత్రం.. ఢిల్లీ పర్యటనకు ముందు వివిధ అంశాలపై చర్చించేందుకు గవర్నర్‌ను కలిసిన సిఎం కెసిఆర్