జాతీయ వార్తలు

భారీ నీటి ప్రాజెక్టులు అనవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టుల అవసరం లేదని, భారీ ప్రాజెక్టుల మూలంగా రైతులు పెద్ద ఎత్తున భూములు కోల్పోవలసి వస్తుందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. బుధవారం హర్యానాలోని ఝాజ్జర్ జిల్లాలో గల జవహర్ లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిపుణులతో కలసి ఆయన సందర్శించారు. గురువారం ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరిపోతాయని చెప్పుకొచ్చారు. లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల పెద్ద మొత్తంలో రైతులు భూములు కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. హర్యానాలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వివరాలను మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులను కలసి ఆ ప్రాజెక్టు ప్రయోజనాలను వివరిస్తామని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. గురువారం మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను రాహుల్‌కు తెలియజేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వివరాలను రాహుల్‌కు వివరించారు.

చిత్రం.. హర్యానాలోని జవహర్‌లాల్ నెహ్రూ ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలిస్తున్న మర్రి శశిధర్ రెడ్డి తదితరులు