రాష్ట్రీయం

దైవశక్తితో కూడిన మంత్రోపాసనతో శరీరంలోని నాడులకు ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: నోరి నరసింహ శాస్ర్తీ గ్రంథాలను ధర్మంకోసం రాశారని, ఆ గ్రంథాలు చదవడం ద్వారా శరీరంలోని నాడులకు ప్రేరణ కలిగి శక్తి చేకూరుస్తుందని పుష్పగిరి శంకరాచార్యులు విద్యాశంకర భారతీస్వామి అన్నారు. నోరి నరసింహశాస్ర్తీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇక్కడి త్యాగరాయ గానసభలో జరిగిన గురుపౌర్ణమి మెహోత్సవంలో గురు పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో స్వామీజీ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్పవారిని సత్కరించడం మన సంస్కృతి గొప్పతనమని ధర్మ ప్రచారం కోసం కృషి చేస్తున్న వారిని సత్కరించడం మనల్ని మనం గౌరవించుకోవడమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు భారతదేశ సంస్కృతికి అలంకారమవుతాయని, వాక్కు ధర్మంకోసం ఉపయోగించే అస్త్రంగా ఉండాలని స్వామీజీ అన్నారు. నోరి నరసింహశాస్ర్తీ గ్రంథాలు చాలావరకు తాను చదివానని ఆయన విజ్ఞాన తపస్సుతో ఆ గ్రంథాలు రాయగలిగారని అన్నారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరరావు మాట్లాడుతూ నోరి గ్రంథాల పఠనంతో విజ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వేదవ్యాస పురస్కారాన్ని డాక్టర్ మల్లవరపు వెంకట రమణశర్మకు, జగద్గురు కల్యాణానంద భారతీమాతాచార్య మహాస్వామి పురస్కారాన్ని దువ్వూరి సుబ్బలక్ష్మికి, సుశ్రుత వైద్య పురస్కారాన్ని డాక్టర్ పన్నాల కృష్ణ సుబ్రహ్మణ్యంకు, కవి సామ్రాట్ నోరి నరసింహశాస్ర్తీ పురస్కారాన్ని పాలకుర్తి రామమూర్తికి విశ్వకర్మ పురస్కారాన్ని సుద్దాల సుధాకర్ తేజకు, చిర్రాపురి విజ్ఞేశ్వర చింతామణి పత్రిక పురస్కారాన్ని మరుమాముల వెంకట రమణశర్మకు, సర్వేపల్లి రాధాకృష్ణన్ లౌకిక గురుపురస్కారాన్ని గీతాశర్మకు, కళాసుబ్బారావు పురస్కారాన్ని డాక్టర్ నండూరి గోవిందరావుకు ప్రదానం చేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అక్షర దర్శనం, కల్యాణ వ్యాస చంద్రిక, కల్యాణ లీలలు, అక్షర సమమ్నయం, అరుణము అగ్నిసూర్య సోమకలలు, భీజాక్షరాల రహస్యం గ్రంథాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముదిగొండ శివప్రసాద్, వారణాసి వెంకటేశ్వరరావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పిఎం గాంధీ వ్యాఖ్యానంలో పురస్కార గ్రహీతల సాహిత్య గొప్పతనాన్ని పద్యరూపంలో గానం చేశారు.

చిత్రం.. విద్యాశంకర భారతీస్వామితో గురుపౌర్ణమి పురస్కార గ్రహీతలు