రాష్ట్రీయం

‘ఇంటింటికి ఇంటర్‌నెట్‌లో తెలంగాణే ముందు!’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంటింటికి ఇంటర్‌నెట్ తెలంగాణలోనే తొలిసారి సాధించబోతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇంటింటికి ఫైబర్ ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదని, కానీ మిషన్ భగీరథతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నట్టు చెప్పారు. మిషన్ భగీరథపై జిల్లాల ఎస్‌ఇలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు పరిధిలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జరుగుతున్న పనులను సింగ్ సమీక్షించారు. గజ్వేల్ నియోజక వర్గంలో ఇంట్రా విలేజ్ పనులు జరుగుతున్నట్టు చెప్పారు. ఇంటింటికి ఇంటర్‌నెట్‌పై గ్రామస్తులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఇంటింటికి మంచినీటి పథకం కింద ప్రతి గ్రామంలో పైప్‌లైన్ కోసం తవ్వకాలు జరిపారని, దీంతోపాటే ఫైబర్ కేబుల్‌లు వేయడం సులువు అయిందని ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ తెలిపారు. ఖర్చు తగ్గడంతో పాటు ఇంటింటికి ఇంటర్‌నెట్ అందించే అవకాశం లభించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మిషన్ భగీరథ గురించి మాట్లాడుతున్నారని ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణమని ఎస్పీ సింగ్ తెలిపారు.