రాష్ట్రీయం

ఫిరాయింపులపై కేంద్రాన్ని నిలదీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్ది పటిష్ఠమైన చట్టాలను రూపొందించేందుకు అన్ని పార్టీలను కలుపుకుని ఉభయ సభల్లో పోరాడాలని వైకాపా అధ్యక్షుడు, ఏపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ ఎంపీలకు పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఆంధ్రాకు చెందిన లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన హామీలను కేంద్రం తక్షణమే అమలు చేసేందుకు వీలుగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లోపాలను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయన్నారు. ఇకపై ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారిన ప్రజా ప్రతినిధులపై వేటు వేసే అధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల సంఘానికి దఖలు పరిచే విధంగా చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై ఢిల్లీలో అన్ని పార్టీలతో సమావేశమై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. పార్టీని ఫిరాయించే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టంలో క్లాజులుండాలన్నారు. రాజ్యసభ సమావేశాల్లో ఎంపి విజయసాయిరెడ్డి పార్టీ ఫిరాయింపులను నివారించేందుకు ఒక ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడచినా, ఇంత వరకు కేంద్రం ప్రత్యేక హోదా హామీని నిలబెట్టుకోలేదన్నారు.
దీని వల్ల పెట్టుబడిదారులు ఆశించినట్లుగా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టలేకపోతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. పట్టిసీమ లిఫ్ట్‌లో కోట్లాది రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. రాష్ట్రంలో అవినీతిపెచ్చుమీరిందని, దేశంలో అవినీతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపి ముందంజంలో ఉంటుందేమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంకు రైల్వే జోన్‌ను వెంటనే ప్రకటించే విధంగా రైల్వేశాఖపై ఒత్తిడి తేవాలన్నారు. పార్టీ ఎంపీలు పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై అన్ని చర్చల్లో చురుకుగా పాల్గొనాలన్నారు. పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత, ఎస్‌పివై రెడ్డితో పాటు తెలంగాణ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి త్వరితగతిన చర్యలు తీసుకునేటట్లు వ్యవహరించాలని ఆయన కోరారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం
మన వాళ్లు మురికి వాడలు కడతారని, అమరావతిని అంతర్జాతీయ స్థాయికి దీటుగా నిర్మించాలంటే విదేశీ సంస్థలే ఉత్తమమని అర్థం వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం అభ్యంతరకరమని వైకాపా ఎమ్మెల్యే కె శ్రీనివాసులు అన్నారు. మురికివాడల్లో ప్రజలంటే అంత చులకన ఎందుకన్నారు. విదేశాల్లో ఎక్కువ పర్యటించిన చంద్రబాబు పేదలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని, మురికివాడల్లో చదివి ఉన్నత స్థానాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారన్నారు.

చిత్రం.. శనివారం హైదరాబాద్‌లో వైకాపా ఎంపీలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్