రాష్ట్రీయం

ఆయుధాలకోసం అజ్మీర్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్‌లో విధ్వంసానికి కుట్రపన్నిన ఉగ్రవాద అనుమానితుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతవరకు ఎన్‌ఐఏ పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు అనుమానితుల్లో ఇద్దరు గత నెలలో అజ్మీర్‌కు వెళ్లి ఒక హోటల్‌లో బసచేసి ఆయుధాల కొనుగోలుకు ప్రయత్నించారు. ఈ వివరాలను రాబట్టేందుకు ఎన్‌ఐఏ పోలీసులు మహమ్మద్ ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇబ్బూ (30), హబీబ్ మహమ్మద్ (32)ను అజ్మీర్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఇద్దరు గత నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అజ్మీర్‌లోని దర్బార్ ప్యాలెస్ హోటల్‌లో ఉన్నారు. సిరియాలో ఉన్న వీరి నేత ఆదేశాల మేరకు అజ్మీర్‌లో ఆయుధాల కొనుగోలుకు ఈ ఇద్దరు నిందితులు ప్రయత్నించినట్టు ఎన్‌ఐఎ పోలీసులు వివరాలు సేకరించారు. అలాగే వీరు దిగిన హోటల్‌లో రికార్డులు, వీడియో ఫుటేజిని కూడా సేకరించారు. కాని ఇద్దరు నిందితులు ఆశించినట్లుగా ఆయుధాలను కొనుగోలు చేశారు.