రాష్ట్రీయం

ఇక కృష్ణ-పెన్నా అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జులై 18:గోదావరి-కృష్ణా నదుల అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఇక కృష్ణానదిని పెన్నాతో అనుసంధానించడంపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. పుష్కరాల సందర్భంగా కృష్ణానదికి ఇచ్చే హారతికి ‘కృష్ణా పవిత్ర నదీ హారతి’గా నామకరణం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తాను చేసిన సంకల్పం నెరవేరుతోందన్నారు. రాష్ట్రం కరవు రహితంగా ఉండాలని, రైతులకు పుష్కలంగా సాగునీరు లభించాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాలని తాను కోరుకున్నానన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా గత ఏడాది 46 టిఎంసిల గోదావరి జలాలు కృష్ణానదికి తరలించామని, ఈ ఏడాది 156 టిఎంసిలు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాలపై కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం రాష్టస్థ్రాయి సమీక్ష సమావేశాన్ని సిఎం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలు కలిసే పవిత్ర ప్రాంతంలో ఇచ్చే హారతి కావడంవల్ల ‘కృష్ణా పవిత్ర నదీ హారతి’ సరైన పేరని ఆయన అభిప్రాయపడ్డారు. కృష్ణా పుష్కరాలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువస్తామని బాబు అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తలెత్తిన సమస్యలను అనుభవంగా మార్చుకుని కృష్ణా పుష్కరాల్లో మరింత జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
పుష్కరాల ఏర్పాట్లు ఈనెల 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని సీఎం సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీ పుష్కర పనులకు సంబంధించి తుది సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ తరువాత పుష్కర పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యతాలోపం వంటి వాటిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పుష్కరాల సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టన పనుల పురోగతిపై సిఎం ఆరా తీశారు. పనుల్లో జాప్యం సహించేది లేదన్నారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తాత్కాలికంగా పనులు చేపట్టి పుష్కరాల తరువాత వాటిని పూర్తిచేయాలన్నారు. పుష్కరాల పనులపై పత్రికల్లో వస్తున్న వ్యతిరేక వార్తలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. సదావర్తి భూముల విషయంలో తప్పుడు వార్తలు రాశారన్న ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, కొలనుభారతి క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి సమస్య ఉందని, ఇక్కడ తాత్కాలిక పనులు చేపట్టి పుష్కరాల తరువాత శాశ్వత పనులు చేయాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిండ ప్రదానానికి పురోహితుల ఎంపిక పూర్తయిందని, శ్రీశైలం సంగమేశ్వరంలో కేవలం 125 మంది మాత్రమే ముందుకు వచ్చారని, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి బ్రాహ్మణులను రప్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పోలీసుశాఖ తరపున కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సుమారు 1500 సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్‌ల సాయంతో భద్రతను, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తామన్నారు. శ్రీశైలం ఘాట్‌రోడ్డులో అక్కడక్కడ క్రేన్‌లు అందుబాటులో ఉంచాలని హితవు చెప్పారు. పుష్కరాలకు ఆర్టీసి 2450 ప్రత్యేక సర్వీసులు నిర్వహిస్తుందని, మరో 500 బస్సులు రిజర్వులో ఉంచుతున్నట్లు ఆర్టీసీ ఎండి తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కెఇ కృష్ణమూర్తి, మాణిక్యాలరావు, కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, మండలి చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
గోదావరి సంకల్పం నెరవేరుతోంది
గైర్హాజరైన అధికారులకు నోటీసులు
పుష్కరాల సమీక్షకు హాజరు కాని ఇద్దరు అధికారులకు నోటీసులు జారీ చేయాలని సిఎం ఆదేశించారు. వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి, అగ్నిమాపక శాఖ సంచాలకులు ఇద్దరూ సమీక్షకు హాజరుకాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి సంజాయిషీ నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని సూచించారు.

చిత్రం.. కర్నూలులో సోమవారం కృష్ణా పుష్కరాలపై నిర్వహించిన సమీక్షలో సిఎం చంద్రబాబు