రాష్ట్రీయం

టీవీ ప్రసారాలపై కమిటీల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21:కేబుల్ టివి ప్రసారాల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మహిళలు, పిల్లల గౌరవాన్ని టివి ఛానెళ్లు కాపాడుతున్నాయా లేదా అన్న అంశంతోపాటు కేబుల్ టివి నెట్‌వర్క్ (రెగ్యులేషన్) చట్టాన్ని చానెళ్లు అట్టడుగు స్థాయిలో సక్రమంగా అమలు చేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ఈ కమిటీలు పరిశీలిస్తాయి. ఈ మేరకు గురువారం రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేసింది. రాష్టస్థ్రాయి కమిటీలో రెవెన్యూ (ఆదాయం), హోం శాఖల ముఖ్య కార్యదర్శులు, సమాచార పౌరసంబంధాల కార్యదర్శి, దూరదర్శన్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల కమిషనర్, వాణిజ్యపన్నుల కమిషనర్ సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి కమిటీలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో రాష్టస్థ్రాయి కమిటీ పరిశీలిస్తుంది. జిల్లాస్థాయి కమిటీలు పంపించే నివేదికలను రాష్టస్థ్రాయి కమిటీ పరిశీలించి కేంద్రానికి నివేదించాల్సి ఉంటుంది. అవసరమైతే జిల్లాస్థాయి కమిటీలకు సలహాలు ఇస్తుంది. జిల్లా స్థాయి కమిటీకి జిల్లా కలెక్టర్ సారథ్యం వహిస్తారు.