రాష్ట్రీయం

స్మార్ట్ హైదరాబాద్‌కు సిస్కో సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: స్మార్ట్ సిటీ ప్రణాళిక కోసం సిస్కోతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయు కుదుర్చుకుంది. మున్సిపల్ వ్యవహారాలు, ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో సచివాలయంలో గురువారం ఈ ఒప్పందం కుదిరింది. సిస్కో స్మార్ట్ సిటీ ప్రణాళికలు, సొల్యూషన్స్‌లో ప్రపంచంలో మంచి పేరున్న సంస్థ. ఈ ఎంఓయులో భాగంగా స్మార్ట్ సిటీ హైదరాబాద్ అనే కానె్సప్ట్‌తో నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పౌరులకు సేవలను అందించేందుకు సిస్కో ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం మొదటి సారిగా సిస్కో స్మార్ట్ సిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో ఎంఓయు కుదుర్చుకుని ఇప్పటికే టి-హబ్‌తో కలిసి పని చేస్తోంది. ఈ ఎంఓయు స్ఫూర్తి మేరకు సిస్కో నగరంలో ఒక పైలట్ ప్రాజెక్టు చేపట్టబోతున్నది. ఈ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన ఎంఓయుపై మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటిఆర్ సమక్షంలో జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి, సిస్కో ఇండియా ఎండి పురుషోత్తం కౌషిక్ సంతకాలు చేశారు. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా హైటెక్ సిటీ ప్రాంతంలో స్మార్ట్ సిటీ సొల్యూషన్స్ ద్వారా పలు సదుపాయాలు కల్పించనున్నారు. సిస్కో సంస్థ మిటుటీ సంస్థతో కలిసి ఈ పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ వైఫై, స్మార్ట్ పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, ట్రాన్స్‌పోర్ట్, స్మార్ట్ కియోస్కిస్, రిమోట్ ఎక్స్‌పర్ట్ గవర్నెన్స్ సర్వీసెస్, సిటిజన్ సర్వీసెస్ పోర్టల్, సిటిజన్ ఆప్స్ వంటి సేవలను అందిస్తారు. ఈ సేవలను అందించేందుకు ఒక సెంట్రల్ సొల్యూషన్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత ఈ స్మార్ట్ సిటీ సేవలను మరింతగా విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది.

చిత్రం..గురువారం సచివాలయంలో టి,మంత్రి కెటిఆర్ సమక్షంలో
ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటున్న సిస్కో ప్రతినిధులు