రాష్ట్రీయం

గవర్నర్‌తో కెసిఆర్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తన ఢిల్లీ పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించినట్టు తెలిసింది. ప్రధానంగా వచ్చే నెల మొదటి వారంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారిగా రాష్ట్ర పర్యటనకు రావడానికి సుముఖత వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌కు వివరించినట్టు తెలిసింది. మిషన్ భగీరథ పథకాన్ని మెదక్ జిల్లా గజ్వేల్‌లో ప్రారంభించడానికి మోదీ అంగీకరించారని, ప్రధాని తొలిసారి రాష్ట్రానికి రానుండటంతో ఆయన పర్యటన సందర్భంగా ఖరారు చేసే కార్యక్రమాలపై కూడా గవర్నర్‌తో ముఖ్యమంత్రి చర్చించినట్టు తెలిసింది. హైకోర్టు విభజన, నదీ జలాల పంపిణి, తొమ్మిదో షెడ్యూల్ కింద ఉన్న సంస్థల విభజన తదితర అంశాలపై ఢిల్లీలో తాను ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులతో చర్చించిన అంశాలను కూడా గవర్నర్‌కు ముఖ్యమంత్రి వెల్లడించినట్టు సమాచారం. పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది.

చిత్రం.. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్