రాష్ట్రీయం

సాయం రూ.700 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక అవసరాల కోసం, వరద సాయంగా కేంద్రప్రభుత్వం 700 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వరద సాయం కింద తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం సైతం వరద సాయం ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ ముందే కోరినా వరద సాయం చేయని కేంద్రం తమిళనాడు కోరగానే రూ. 940 కోట్లు మంజూరు చేసింది. దీనిపై ఆరోపణలు మిన్నుముట్టడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సమగ్ర నివేదికలు తెప్పించుకుని 700 కోట్ల రూపాయలను కేంద్ర ప్రణాళికా పథకాల నిధుల నుండి కేటాయించింది. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం అయ్యిందని, సహాయ పునరావాస కార్యక్రమాల కోసం కేంద్రం తక్షణం ఆదుకోవాలని ఆర్ధిక సాయం అందించాలని సిఎం వారం క్రితం కోరారు. భారీ వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడమే గాక, చెరువులు, కుంటలు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. వర్షాలకు రాష్ట్రంలో 35 మంది చనిపోయారని, 613 మూగజీవులు మృతి చెందాయని ముఖ్యమంత్రి తెలిపారు. 467 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, 2029 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని , రెండు లక్షల హెక్టార్లకు పైగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 550 సాగునీటి వనరులు నాశనమయ్యాయని చెప్పారు. 1860 కిలోమీటర్లు మేర రహదారి వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని మొత్తం మీద ప్రాథమికంగా నాలుగువేల కోట్ల రూపాయల వరకూ నష్టం జరిగిందని వివరించారు.
ఇసుక తవ్వకాలపై నేడు శే్వతపత్రం
విజయవాడ: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపైనా, ప్రభుత్వం అనుసరిస్తున్న ఇసుక విధానంపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మధ్యాహ్నం శే్వతపత్రం విడుదల చేయనున్నారు. బాక్సైట్, ఇసుక విధానాలపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు తక్షణం టోల్‌ఫ్రీ నెంబర్‌తో ఫీడ్‌బ్యాక్ సెంటర్‌ను ఏర్పాటు చేయడమేగాక వెబ్‌సైట్‌ను ప్రారంభించాలంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.