రాష్ట్రీయం

ఏపితో జల వివాదం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 21: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తెలంగాణకు జల వివాదాలేమీ లేవని, అయితే ఆ రాష్ట్రానికి తెలియని విషయాలను చెప్తుంటే పట్టించుకోకుండా వివాదాలకు తావిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన స్వగృహంలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి నదులు తెలంగాణలోకి ప్రవేశించకముందు కొన్ని వందల కిలోమీటర్లు మహారాష్ట్ర ఏ ప్రాజెక్ట్‌ను కట్టే పరిస్థితి లేదని, దీంతో ఆ నదుల ద్వారా గోదావరిలోకి భారీగా నీరు వస్తోందన్నారు. భద్రాచలం దిగువన తెలంగాణ ఎన్ని ప్రాజెక్ట్‌లు కట్టినా, ఎన్ని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటుచేసినా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడిన 80టిఎంసిల కంటే నీరు అదనంగానే వస్తుందన్నారు. కొన్ని వందల టిఎంసిల నీరు వృథాగా సముద్రంలో కలుస్తుందని, అలా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి అవసరమైనా వారు నీరు వాడుకుంటే బాగుంటుందన్నారు. కృష్ణా జల వివాదం విషయంలో తెలంగాణకు అనుకూలత ఉందన్నారు. అపెక్స్ కమిటీ నివేదికకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశామన్నారు. కృష్ణా ఆయకట్టుకు పూర్తిగా నీరువచ్చే పరిస్థితి లేదని, అందుకే జీవనదిగా పేరున్న గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామన్నారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం, రుద్రంకోట ప్రాజెక్ట్‌లను తాము పట్టించుకోవటం లేదని, ఎప్పటికైనా అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నేతలే కట్టుకోవచ్చని ఏద్దేవా చేశారు.