తెలంగాణ

అరచేతిలో జలవనరుల సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: ఇక తెలంగాణలో అరచేతిలో జలవనరుల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇది నీటిపారుదల రంగంలో నూతన ప్రయోగం. నీటిపారుదల పరిస్థితి సమీక్షకు ఉపగ్రహ సహకారం తీసుకుంటారు. జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహంతో విశే్లషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయోగానికి నాంది పలికినట్టు ఇస్రో కితాబు ఇచ్చింది. ఆగస్టు 6న దీనికి సంబంధించి ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇస్రోకు చెందిన అత్యాధునిక సాంకేతిక, ఉపగ్రహ సేవలను ఉపయోగించుకోనున్నది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థను నిర్మిస్తోంది. తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ (టిడబ్ల్యుఆర్‌ఐఎస్) ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్రోతో ఆగస్టు 6న ఒప్పందం కుదురనుంది.
నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్‌ల సమక్షంలో ఈ ఎంఓయు కుదురుతుంది. జలవనరుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేసి, ఉపగ్రహ చిత్రాలతో నీటి నిల్వలు ఇతర అంశాలను విశే్లషించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రకెక్కనున్నదని ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ డాక్టర్ పిజి దివాకర్ శుక్రవారం తెలిపారు. ఇస్రో బృందం సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఇకపై తెలంగాణలోని చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ఇతర జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు ఉపగ్రహంతో సమీక్షించి, విశే్లషించే విధానం అమలులోకి రాబోతున్నది. ప్రతి 15 రోజులకు ఒకసారి జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహం ద్వారా నమోదు చేయనున్నారు. టిడబ్ల్యుఆర్‌ఐఎస్‌ను ఇరిగేషన్ శాఖలోని ఇంజనీర్లు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని హరీశ్‌రావు కోరారు. దీనిని ఉపయోగించుకునే విధంగా యువ ఇంజనీర్లకు తగిన శిక్షణ ఇవ్వాలని మంత్రి ఇస్రో అధికారులను కోరారు. భారీ వర్షాల వల్ల ఖమ్మం, ఆదిలాబాద్ వంటి జిల్లాలలో మిషన్ కాకతీయ 1లో చేపట్టిన చెరువులు పొంగి పొర్లుతున్నందున మిషన్ కాకతీయకు ముందు తరువాత ఆయా చెరువుల పరిస్థితిని ఉపగ్రహ చిత్రాలతో విశే్లషించి నివేదిక ఇవ్వాలని ఇస్రో అధికారులను హరీశ్‌రావు కోరారు. బ్యారేజీ డ్యామ్‌లు, కెనాల్‌లు, ఇతర స్ట్రక్చర్ల పరిస్థితులను కూడా ఉపగ్రహ సహకారంతో మార్క్ చేయాలని మంత్రి హరీశ్‌రావు కోరారు.

శుక్రవారం సచివాలయంలో ఇస్రో అధికారులతో చర్చిస్తున్న తెలంగాణ మంత్రి హరీశ్‌రావు