రాష్ట్రీయం

శ్రీకాళహస్తిలో కాల్‌మనీ వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి/ఆత్మకూరు, డిసెంబర్ 18: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాల్ మనీ వ్యవహారం చిత్తూరు శ్రీకాళహస్తిలోనూ వెలుగుచూసింది. శ్రీ కాళహస్తి పట్టణంలో ఒక మహిళా వడ్డీ వ్యాపారి రుణం తీసుకొన్న వారిని వేధిస్తోందని ఫిర్యాదు రావడంతో పోలీసులు శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలోని వేళంపాలెం ప్రాంతానికి చెందిన మంజులమ్మ వడ్డీ వ్యాపారం చేస్తోందని సకాలంలో చెల్లించలేని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులకు కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వన్ టౌన్ సి ఐ చిన్న గోవిందు వడ్డీ వ్యాపారి మంజులమ్మను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వేధింపుల విషయాలు కొన్ని రుజువుకావడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఇదిలావుండగా నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండల కేంద్రంలో ఒక తండల్ వ్యాపారి తానిచ్చిన సొమ్ము చెల్లించని కారణంగా మూడంతస్థుల భవనాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన వెలుగులోకివచ్చింది. దీనిపై బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. మండల కేంద్రమైన అనుమసముద్రంపేటకు చెందిన షేక్ సాబ్జాన్ తాను ఒక వ్యాపారి వద్ద 14నెలల కిందట 30లక్షల రూపాయలు అప్పు చేయగా వడ్డీ కోటి 20లక్షలు అయిందని అందుకు తాము నివసిస్తున్న మూడంతస్థుల భవంతిని స్వాధీనం చేసుకున్నాడని వాపోయారు. ఈమేరకు బాధితుడు తనకు న్యాయం చేయమని శుక్రవారం పోలీసులను ఆశ్రయించాడు.

కాల్‌మనీ కేసులో
మరో నిందితుడి అరెస్టు

విజయవాడ (క్రైం), డిసెంబర్ 18: రాష్టవ్య్రాప్తంగా కలకలం రేపిన విజయవాడ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసులో మరో నిందితుడిని మాచవరం పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా నిందితుడు భవానీశంకర్‌ను న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. పటమటకు చెందిన యలమంచిలి రాము నేతృత్వంలో పంటకాలువ రోడ్డులో ఓ కార్యాలయం నిర్వహిస్తూ ట్రస్టు పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. మరోవైపు అప్పుకోసం వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తూ వారి పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఓ మహిళ ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్ డి గౌతం సవాంగ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ సెక్స్‌రాకెట్ ముఠా గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే. ఇంకా పరారీలో ఉన్న డిఇ సత్యానందం, చెన్నుపాటి శ్రీను, వెనిగళ్ళ శ్రీకాంత్, పెండ్యాల్ శ్రీకాంత్‌లను అరెస్టు చేయాల్సి ఉంది. ఇదిలావుండగా ఇప్పటికే జైలులో ఉన్న ప్రధాన నిందితుడు రాము, దూడల రాజేష్‌లను విచారించాల్సి ఉన్నందున కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై శనివారం విచారణ జరగనుంది. ప్రస్తుతం అరెస్టయిన భవానీశంకర్ ప్రధాన నిందితుడు యలమంచిలి రాము వద్ద బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు.