రాష్ట్రీయం

జూరాల నీళ్లపై పేచీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: కృష్ణా జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ లేఖల యుద్ధం ప్రారంభమైంది. కృష్ణాబోర్డు అనుమతి లేకుండా, కేంద్ర జల సంఘం ఆమోదం లేకుండా జూరాల నుంచి నాలుగు ఎత్తిపోతల పథకాలకు సాగునీటిని విడుదల చేయడం తగదని తెలంగాణపై ఏపి కేంద్రానికి ఫిర్యాదుచేసింది. కాగా పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి రూ.115 కోట్లను చెల్లించి నీటి నిల్వ సామర్ధ్యం పెంచుకోవాలని, ముంపు గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏపికి లేఖ రాసింది.
కృష్ణా నదిపై అనుమతి లేని ప్రాజెక్టులు నిర్మించి వాటికి కృష్ణా జలాలను విడుదల చేయడమంటే దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసినట్లేనని, వెంటనే తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలంటూ ఏపి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన బీమా, కోయిల సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తికి సాగునీటిని విడుదల చేసింది. ట్రయల్ రన్ ప్రాతిపదికన సాగునీటిని విడుదల చేయడంపై ఏపి ఘాటుగా స్పందించి కేంద్రానికి లేఖ రాసింది. ఈ ప్రాజెక్టులకు 16 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కేంద్ర జల సంఘం వెంటనే జోక్యం చేసుకుని దిగువన ఉన్న ఏపిని ఆదుకోవాలని లేఖలో కోరారు. సోమవారం ఏపికి చెందిన అధికారులు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులను కలిసి వాస్తవ పరిస్ధితిని వివరించనున్నారు.
పులిచింతల పూర్తి కావాలంటే నిధులు ఇవ్వండి
పులిచింతల ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ముందుగా రూ.115 కోట్లు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రకు లేఖ రాసింది. పులిచింతల ప్రాజెక్టు వల్ల నల్లగొండ జిల్లాలో 18 గ్రామాలు, కొన్ని ఎత్తిపోతల పథకాలు ముంపునకు గురవుతాయి. వీటి నిమిత్తం రూ. 115 కోట్ల నిధులు చెల్లించాలని లేఖలో కోరారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాదాపు45 టిఎంసి నీరు నిల్వ ఉంటుంది.