రాష్ట్రీయం

పిఒకెను వెనక్కి తేవడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: ‘ప్రధాని నరేంద్ర మోదీ వౌన స్వామి కాదు..’ అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రాంమాధవ్ అన్నారు. నగరంలోని సత్యసాయి నిగమాగమంలో ‘లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, వాట్ నెక్స్ట్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాం మాధవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాం మాధవ్ ప్రసంగిస్తూ సభికులను ఉర్రూతలూగించారు. ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడడం లేదని కొంత మంది అంటుంటారని రాం మాధవ్ చెబుతూ తప్పకుండా మాట్లాడతారని అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)ను వెనక్కి తీసుకుని రావడమే లక్ష్యం అని ఆయన తెలిపారు. కాశ్మీర్ భౌగోళికంగానే కాదు అక్కడ ఉన్న ప్రజలూ మన దేశానికి చెందిన వారేనని అన్నారు. ఇందిరాగాంధీ-్భట్టో సిమ్లా ఒప్పందం సమయంలో 94 వేల మంది పాకిస్తాన్ ఖైదీలు మన చేతిలో ఉన్నా, కాశ్మీర్ మన దేశ అంతర్భాగమేనని ప్రకటింపజేసుకోవడంలో విఫలమయ్యామని అన్నారు. ఆ ఒప్పందం సమయంలో ఏమీ సాధించుకోకుండా ఖైదీలను విడుదల చేయడం జరిగిందని ఆయన తెలిపారు. దీంతో 40 సంవత్సరాల త ర్వాత కూడా పాకిస్తాన్ ప్రధాని కాశ్మీర్ తమదేనని ప్రకటించుకున్నారని ఆయన తెలిపారు.
సార్క్ దేశాలలో రాజీవ్ గాంధీ మయన్మార్‌ను చేర్చుకోలేదని ఆయన చెప్పారు. అమెరికా-క్యూబా దేశాలు 30 సంవత్సరాల పాటు మాట్లాడుకోలేదని అన్నారు. ఆ తర్వాత చర్చలే ప్రధానం అని అమెరికా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపడం ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కరించుకోవాలని, ప్రధాని మోదీ ఎందుకు చర్చించడం లేదని కొంత మంది అంటున్నారని ఆయన చెబుతూ ప్రధాని మోదీ వౌన స్వామి కాదని, తప్పకుండా చర్చించి సాధిస్తారని ధీమాగా చెప్పారు. భారత్-పాక్‌ల మధ్య ఇదే ప్రధాన సమస్యగా ఉందని అన్నారు. ఉగ్రవాది బుర్హాన్ విషయం మీడియాకు కావాలని, కానీ శాంతికాముకులు కాదని ఆయన అన్నారు.
శాశ్వత శతృత్వం ఉండదు
విదేశాంగ విధానం మారుతూ ఉంటుందని ఆయన తెలిపారు. డిప్లొమసీ అంటేనే శాశ్వత శతృవు కాదు, శాశ్వత మిత్రులు కాదని, శాశ్వత ప్రయోజనాలేనని గమనించాలని ఆయన చెప్పారు. చైనా గోడ తరహాలో మనం ఎందుకు గోడ కట్టలేక పోయాం, గోడ కట్టి ఉంటే మొఘలులు వచ్చే వారా? అని అన్నారు. అది మన సంస్కృతి కాదని ఆయన తెలిపారు.
వ్యూహాత్మక విధానం మనదని, ఇతర దేశాల తరహాలో ఉండదని ఆయన చెప్పారు. ‘నెహ్రూ హ యాంలో ఆసియన్ దేశాల సమావేశంలో టిబెట్ జెండా తీసేశాం, హిందీ, చీని భాయి, భాయి అన్నది నినాదమే తప్ప వ్యూహం కాలేకపోయింది’ అని ఆయన అన్నారు.
స్వాతంత్య్రం తర్వాత ఈ విషయాలపై దృష్టి పెట్టలేకపోవడం దురదృష్టకరం అని ఆయన తెలిపారు. జపాన్ కూడా మన దేశం తరహాలో స్వా తంత్య్రం సంపాదించుకుందని, తన మీద దాడులు జరిగితే ‘నాటో’లో చేరి రక్షణ ఖర్చు తగ్గించుకుందని చెప్పారు. కమ్యూనిస్టు మావో, కమ్యూనిస్టు ఆలోచన చైనా దేశానిదని అన్నారు. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో మనం ఎవరితోనూ స్నేహపూర్వకంగా ఉండకపోవడంతో ఏ దేశంతోనూ సరైన సంబంధాలు లేవని ఆయన తెలిపారు. దేశం రక్షణ వల్ల నిలబడుతుందే తప్ప ఉగ్రవాదుల వల్ల కాదని రాంమాధవ్ అన్నారు.
పంచామృత్ విధానం..
ప్రధాని మోదీ విదేశీ విధానానికి పంచామృత్ అని ఆయన నామకరణం చేశారు. సన్మాన్, సంవాద్, సమృద్ధి, సంరక్షణ, సంస్కృతి అని ఆయన తెలిపారు.
సాంస్కృతిక సంప్రదాయాల ద్వా రా, అంతర్జాతీయ దౌత్య విధానంతో ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. ప్రధాని మోదీకి ఏ దేశానికి వెళ్ళినా అపూర్వ స్వాగతం లభిస్తున్నదని ఆయన చెబుతూ అదే విధంగా భారతీయులు ఏ దేశానికి వెళ్ళినా ఆ గౌరవమే దక్కాలన్నది ప్రధాని భావన అని ఆయన తెలిపారు. లోగడ బాలిలాంటి ద్వీపంతో కూడా మనం సత్సంబంధాలు నెలకొల్పుకోలేకపోయాం, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలతో మంచి స్నేహ సం బంధాలు నడుస్తున్నాయని అన్నారు. తూర్పు దేశాలతో సంబంధం అంటే అమెరికాతో సంబంధం చెడిపోవడం కాదని అన్నారు.
భూమి గుండ్రంగా ఉంది కాబట్టి అమెరికా ప్రియులు కూడా బాధపడాల్సిన అవసరం లేదని మరో దిశగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇండియా లీడింగ్ పవర్‌లో ఉండాలి కానీ బ్యాలెన్సింగ్ పవర్‌లో కాదన్నది బిజెపి ప్రభుత్వ విధానం అని రాంమాధవ్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో ఇఫ్లూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సునయన సింగ్, సీనియర్ జర్నలిస్టు రాకా సుధాకర్, విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు.

హైదరాబాద్‌లోని సత్యసాయి నిగమాగమంలో ఆదివారం ‘లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, వాట్ నెక్స్ట్’ అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగిస్తున్న బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్