రాష్ట్రీయం

పిపిపితోనే దేశాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్తుకూరు, జూలై 24: దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే పబ్లిక్, ప్రైవేటు రంగాలతోనే సాధ్యమని తద్వారా దేశ ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారని సమాచార, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో ఆదివారం కాన్‌కర్డ్ పోర్ట్‌సైడ్ కంటైనర్ సేవలను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు సురేష్ ప్రభాకర్ ప్రభు, వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ, తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వి వరప్రసాద్, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ ఎం జానకి, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే తీరంలో ఓడరేవుల ఏర్పాటు ఎంతైనా అవసరమన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీ నామస్మరణే చేస్తున్నారని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరిగితే తద్వారా ఆ ఫలాలు అందరికీ అందుతాయన్నారు. జన్‌ధన్ యోజన పథకం కింద ఒక్క సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం 21.8 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరిచిందన్నారు. దేశంలోని ప్రతిఒక్కరికి రుణాలు అందాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. బ్యాంకుల ద్వారా 3.6 కోట్ల మందికి రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. దేశంలో ఎగుమతులు, దిగుమతులు ఓడరేవుల ద్వారా పెరిగితేనే అభివృద్ధి సాధించగలమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 58 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదేళ్లలోనే సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగడం సంతోషకరమని అన్నారు. దేశాభివృద్ధిలో అన్ని వర్గాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి పారిశ్రామికంగా ముందుకు సాగడం శుభపరిణామమని పేర్కొన్నారు. దేశంలోనే అతి పెద్దదైన కృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో ఏర్పాటు కావడం జిల్లా ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. ఓడరేవు ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా స్మార్ట్ సిటీలలో స్థానంలో కృష్ణపట్నం ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుందని తెలిపారు. అనంతరం కంటైనర్ సేవలను మంత్రి వెంకయ్యనాయుడు, రైల్వే శాఖ మంత్రి ప్రభు ప్రారంభించారు. రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు మాట్లాడుతూ కృష్ణపట్నం, ఓబులాపురం రైల్వే రోడ్డు మార్గాల ద్వారా అనేకమంది మెట్ట ప్రాంతవాసులు ఉపాధిపొందారని అన్నారు.
ఈ ఆర్థిక వ్యవస్థలో ఓడరేవుల అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. తీరప్రాంతాల్లో ఓడరేవులు ఏర్పాటుతో దేశ విదేశాలకు ఎగుమతులు, దిగుమతుల రవాణా ఊపందుకుందని అన్నారు. కంటైనర్ కాన్‌కర్డ్ సేవలను అందించడం శుభసూచకమని తెలిపారు. తదుపరి సౌత్ బెర్త్ ప్రదేశంలో గోల్ఫ్ కోర్టును ఆయన ప్రారంభించారు.

కృష్ణపట్నం పోర్టులో జెండా ఊపి కంటైనర్
సేవలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు...
గోల్ఫ్ కోర్సును ప్రారంభించి
గోల్ఫ్ ఆడుతున్న వెంకయ్య, సురేష్‌ప్రభు