రాష్ట్రీయం

కాల్ మనీ దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: కాల్ మనీ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో గందరగోళం, దుమారం చెలరేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టగా, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురు దాడి చేశారు. టిడిపి-వైకాపా ఎమ్మెల్యేలు పరస్పరం విమర్శించుకున్నారు. పలు పర్యాయాలు స్పీకర్ పోడియంపైకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఎం డౌన్-డౌన్ అంటూ నినాదాలు చేశారు.కాల్ మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటన ప్రారంభించగానే వైఎస్ జగన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశారు. అక్కడి నుంచే సుమారు 3 గంటల పాటు సభలో పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని వైకాపా ఎమ్మెల్యేలు పట్టుబట్టగా, ప్రకటన పూర్తయిన తర్వాత వివరంగా చర్చించవచ్చని స్పీకర్ చెప్పినా వారు వినిపించుకోలేదు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి నినాదాలు చేశారు. దీంతో చంద్రబాబు ఆగ్రహంతో ‘వైకాపాకు చెందిన 65 మంది ఉన్నందున, మీ బాగోతం బయటపడుతుందని భయపడి గొడవ చేస్తున్నారు..ఇది అసెంబ్లీ, ఇడుపులపాయ కాదు..’ అని విమర్శించారు. ఈ వ్యవహారంలో ఎవరు ఉన్నా వదిలి పెట్టమని హెచ్చరించారు. జ్యుడిషీయల్ విచారణ జరిపిస్తున్నామని, కమిషన్‌కుగానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. తాను ఎవరికీ భయపడనని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం దీనిని అరికట్టేందుకు శ్రద్ధ చూపలేదని ఆయన విమర్శించారు. పోడియం వద్దకు చేరుకున్న వైకాపా ఎమ్మెల్యేలు సిఎం డౌన్-డౌన్ అంటూ నినాదాలు చేశారు. అందుకు చంద్రబాబు స్పందిస్తూ ఈ 10 మంది ఎమ్మెల్యేలు డౌన్-డౌన్ అంటే ఏమీ కాదని, ప్రజలు నిర్ణయిస్తారని, వీళ్ళు మొదటి సారి ఎన్నికయ్యారని, వీళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలియదని, తప్పులు చేయడం, జైలుకు వెళ్ళడం పరిపాటయిందని అన్నారు. అసెంబ్లీని అడ్డుకోలేరని, తాను ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని ఆయన తెలిపారు. ఒక దశలో టిడిపి ఎమ్మెల్యే ఎ. రాజేంద్ర ప్రసాద్ వైకాపా ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్ళేందుకు ప్రయత్నించగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వద్దని వారించారు. ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ కాల్ మనీపై వైకాపా సభ్యులకు చర్చించాలని ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ దశలో జగన్ రెండు చేతుల్లో ఒక పుస్తకాన్ని (కౌల్ అండ్ షక్దర్) చూపించసాగారు. స్పీకర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకునికి ప్రాధాన్యం ఉంటుంది కానీ, సభా నాయకుడు మాట్లాడిన తర్వాతే అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ ప్రకటన ప్రారంభం కాక ముందే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఈ సమయంలో వైకాపా ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానం వైపు వెళ్ళి ఆయన ప్రసంగించకుండా అడ్డుపడ్డారు.
సిఎంకే రక్షణ లేకపోతే..
చంద్రబాబు మాట్లాడుతూ సిఎంకే రక్షణ లేకపోతే ఇక ఎవరికి ఉంటుందని, వీరు రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. తాను ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు సిఎంగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, ఎప్పుడూ ఇలా చూడలేదని అన్నారు. బజారు రౌడీల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని, తన సీటు వద్దకు వచ్చి మాట్లాడుతున్నారని, తమాషా చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. సిఎం స్థానం వైపు వెళ్ళడాన్ని స్పీకర్ తప్పుపట్టారు. చర్చ జరగకుండా గొడవ చేసి సభను వాయిదా వేయించుకోవాలనుకుంటున్నారా? అని స్పీకర్ వారిని ప్రశ్నించారు. కాగా, బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలను నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆయనకు కోపం వచ్చి ‘నేను తలచుకుంటే రెండు నిమిషాలు పట్టదు..’ అని హెచ్చరికగా అన్నారు. జగన్ మాట్లాడుతూ సభలో ప్రకటన చేయడానికి ముందు కూడా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీయవచ్చని చెప్పారు.
స్పీకర్ మాట్లాడుతూ జగన్ సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. జగన్ తిరిగి మాట్లాడుతూ కౌరవ సభలా జరుగుతుంటే ప్రజా సమస్యలు చర్చకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సెక్స్ రాకెట్‌లో సిఎం నిందితుడని, ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలని ఆయన విమర్శించారు. శాసనసభావ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ 34 ఏళ్ళలో తాను ఇటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యేను చూడలేదని అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలకూ తాము చేస్తున్నది తప్పని వారి ముఖాలను చూస్తే అర్థమవుతున్నదని ఆయన చెప్పారు.
టిడిపి ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యే రోజా సిఎంను ‘కాల్‌మనీ’, ‘కాల్ బాబు’, ‘కామ చంద్రబాబు’ అని వ్యాఖ్యానించినందున ఆమెను సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో వైకాపా ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్ళి నినాదాలు చేయడం ప్రారంభించడంతో స్పీకర్ సభను 10 నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభంకాగానే మళ్ళీ అదే గొడవ మొదలైంది. టిడిపి ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎంపై దాడికి జగన్ ఎమ్మెల్యేలను పంపించారని, జగన్‌ను మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని సూచించారు. జగన్ మాట్లాడుతూ ఇది నియంతృత్వ ప్రభుత్వమని విమర్శించారు.