ఆంధ్రప్రదేశ్‌

ఇదెక్కడి న్యాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26:ఏ పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారో, అదే పార్లమెంట్ సాక్షిగా ఏపికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గ సమావేశం వివరాలను వెల్లడించేందుకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిశితంగా విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ లబ్ది పొందాలని భావించిందని అన్నారు. జైరాం రమేష్ రాసిన పుస్తకంలో కూడా ఈ విషయాన్ని పేర్కొన్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయం గురించి ఇటీవల జరిగిన అంతర్రాష్ట్ర మండలి సమావేశంలోనూ తాను గొంతెత్తానని చెప్పారు. వివిధ పార్టీల ముఖ్యమంత్రులంతా ఈ సమావేశంలో ఉన్నారని, వారందరినీ ఒప్పించి ఏపికి న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్టు సిఎం తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత సుమారు 16 వేల కోట్ల ఆర్థిక లోటులో ఏపి ఉందని, దాన్ని భర్తీ చేయమంటే ఇప్పటి వరకూ కేంద్రం స్పందించలేదని ఆయన అన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి కేంద్రం పెదవి విప్పడం లేదని అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించినప్పటికీ, నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బుందేల్‌ఖండ్ ప్యాకేజీని ఏపికి అమలు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా గురించి పలుసార్లు అడిగినా కేంద్రం స్పందించడం లేదు. రాష్ట్ర విభజన రోజున పార్లమెంట్‌లో ఏపి తరపున మాట్లాడిన వారు కూడా ఇప్పుడు పెదవి విప్పడం లేద’ని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం డబ్బులు ఇవ్వలేదనే సాకుతో పనులు నిలిపేసే పరిస్థితి లేదని అన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం ఇబ్బందికరంగా లేదా? అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు కేంద్రం తమ చేతులు కట్టేసి పరిగెత్తమంటోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘ఎన్నికలకు ముందు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. కేంద్రంలోని అధికార పక్షం కూడా ఏపి ప్రజలకు మాట ఇచ్చింది. నా హామీలను నేను నిలబెట్టుకుంటున్నాను. అలాగే కేంద్రం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల’ని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పుష్కరాలకు కేంద్రం నిధులు ఇస్తుందా? అని ప్రశ్నించగా, ఇవ్వడానికి సుముఖత చేయలేదని చంద్రబాబు చెప్పారు.
chitram...
మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు