రాష్ట్రీయం

పొంగిన వాగులు, వంకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని/పత్తికొండ: కర్నూలు జిల్లాలో మంగళవారం రాత్రి భారీ వర్షాలకు కురిశాయి. దీంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఆదోని డివిజన్‌లోని హంద్రీనది పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో హంద్రీ పొంగిపొర్లింది. చిన్నహుల్తి వద్ద బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో వాహనాలను దారి మళ్లించారు. పత్తికొండ మండలంలోని నల్లవాగు, సీతూరు వంక ఉద్ధృతంగా ప్రవహించాయి. ఎమ్మిగనూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్లలో భారీ వర్షం కురిసింది. కోడుమూరు మండలంలోని గాజులదినె్న ప్రాజెక్టు వర్షాలకు నిండింది.

చిత్రం... భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలో
హంద్రీవాగు పొంగడంతో నిలిచిపోయిన వాహనాలు