రాష్ట్రీయం

అలసత్వం సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: సెప్టెంబర్ నాటికల్లా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కంప్యూటరైజేషన్, ఆటోమేషన్‌తో మున్సిపల్ పాలనా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ప్రజా సేవలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఆన్‌లైన్ ద్వారా మరింత సమర్థవంతంగా, వేగవంతంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1,648 కోట్లతో తలపెట్టిన 338 పనులు పురోగతి గురించి వాకబు చేశారు. మూడు నెలల్లో పనులు పూర్తి కావాలని, 15 రోజులకోసారి పనులను సమీక్షిస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే డ్రోన్ సహాయంతో వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. పనుల్లో నాణ్యత పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెడతామన్నారు. అక్టోబర్ రెండు నాటికి రాష్ట్రంలో బహిరంగ మల విసర్జన లేకుండా చేస్తామన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా ఇంటికో మరుగుదొడ్డి కార్యక్రమం అమలును ముమ్మరం చేయాలని ఆదేశించారు. అర్హులైన 1,47,365 మందికి రేషన్‌కార్డుల పంపిణీని నిర్ణీత కాల గడువులోగా పూర్తి చేసి తీరాలన్నారు. గృహ నిర్మాణ కార్యక్రమంపైనా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.రాష్ట్రంలో ఉద్యమంలా మొదలైన వనం-మనం కార్యక్రమం కింద ప్రతి మున్సిపాలిటీలో 10 లక్షల మొక్కలు నాటాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.పట్టణాల్లో కుక్కలు, పందులు, కోతుల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ నెల 30న పోలవరం ప్రాజెక్ట్ పనులను ప్రయోగాత్మంగా మీడియా సమక్షంలో వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేస్తామని సిఎం చెప్పారు.

చిత్రం.. విజయవాడలో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు