రాష్ట్రీయం

అవును.. నిజమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ఎమ్సెట్-2 లీకేజి కేసులో సిఐడి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిని మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపర్చారు. సంచలనం కలిగిస్తున్న ఈ కేసులో విష్ణ్ధుర్ అలియాస్ విష్ణువర్ధన్, తిరుమల్ అలియాస్ తిరుమల్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలకమైన అంశాలను సిబిఐ గురువారం వెల్లడించింది. నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ డిజిపి కార్యాలయం ప్రకటించింది. అందరూ అనుకున్నట్లుగా లీకేజి ప్రధాన సూత్రధారి రాజ్‌గోపాల్ రెడ్డి, రమేష్‌తో పాటు, ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాన్ని బయటకు తెచ్చినట్లు ఆరోపణ ఉన్న షేక్ నిషాద్, సహకరించిన గిడ్డూ, హైదరాబాద్‌లో రిసోర్సెస్ కోచింగ్ సెంటర్ అధినేత వెంకట్రావు అరెస్టులను సిఐడి చూపించలేదు. వీరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు సమాచారం. ఎమ్సెట్-2లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్ధుల్లో కొందరు అనుమానితులను సిఐడి అదుపులోకి తీసుకుని కూలంకషంగా ప్రశ్నించింది. ఈ విచారణలో ఎమ్సెట్-2 ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తమకు ముందుగా తెలిసినట్లు విద్యార్ధులు తెలిపారు. రెండు సెట్ల ప్రశ్నపత్రాలను బ్రోకర్లు విద్యార్ధులకు అందచేశారు. ఎమ్సెట్-2 పరీక్ష జూలై 9వ తేదీన జరగగా, నాలుగు రోజుల ముందుగా విద్యార్ధులను బెంగళూరుతోపాటు ఐదు నగరాలకు బ్రోకర్లు తీసుకెళ్లినట్లు సిఐడి పేర్కొంది. బ్రోకర్లు అందించిన ప్రశ్నపత్రాల్లో మొత్తం 320 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సరైన సమాధానాలను నిపుణలచేత చెప్పించి శిక్షణ ఇచ్చారు. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో నిందితులు ఉన్నట్లు సిఐడి గుర్తించింది. ఈ మొత్తం విద్యార్ధులను హైదరాబాద్ నుంచి బెంగళూరు తదితర నగరాలకు తీసుకెళ్లడం, అక్కడ శిక్షణ ఇప్పించడం వెనక రాజ్‌గోపాల్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని సిఐడి అదనపు డిజి సత్యనారాయణ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా ప్రశ్నపత్రాల లీకేజికి పథకం పన్నినట్లు సిఐడి విచారణలో తేలినట్లు సమాచారం. సూత్రధారి రాజ్‌గోపాల్‌రెడ్డికి సహాయకుడిగా వ్యవహరించినట్లు అభియోగాలు ఉన్న రమేష్ ఆర్మీలో పనిచేసి కోచింగ్ సెంటర్ల ఏజెంట్‌గా పనిచేసేవాడు. రమేష్ 20 సంవత్సరాల క్రితమే కనిగిరి వదిలి హైదరాబాద్‌లో ఉప్పల్‌లో స్ధిరపడినట్లు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల కాల్ లిస్టులో ఎమ్సెట్ కన్వీనర్ కార్యాలయానికి చెందిన కొంతమంది కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ఒక ప్రొఫెసర్ ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిఐడి ధ్రువీకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ కేసులో కొన్ని కీలకమైన ఆధారాలు లభించడంతో సిఐడి పోలీసులు ఆదిలాబాద్, కరీంనగర్ నగరాల్లో కొంత మంది ఇండ్లలో సోదాలు జరిపినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఎమ్సెట్ కన్వీనర్ రమణారావు గురువారం డిజిపి అనురాగ్ శర్మ, సిఐడి అదనపు డిజి సత్యనారాయణను కలిసి చర్చించారు.