రాష్ట్రీయం

రద్దు తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28:ఎమ్సెట్ భవితవ్యం నేడు తేలనుంది. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినా పర్యవసానాలపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రశ్నపత్రం లీక్ నిజమేనంటూ సిఐడి కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వద్ద మరో ప్రత్యామ్నాయం కూడా లేదని తెలుస్తోంది. అయితే తల్లిదండ్రులు, విద్యార్థుల స్పందన ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎమ్సెట్‌పై ప్రభుత్వం నుంచి గురువారమే ప్రకటన వెలువడుతుందని విద్యార్థులు, తల్లిదండులు సాయంత్రం దాకా ఎదురు చూశారు. అయితే పర్యవసానాలపై చర్చల్లో మునిగిపోయిన సంబంధిత మంత్రులు సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థుల వద్దకు వచ్చే సాహసం చేయలేకపోయారు. మరో వైపు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మంగళవారం నుండి గురువారం వరకు మంత్రి లక్ష్మారెడ్డి వరుసగా ఉన్నతస్థాయి సమావేశాలను ఏర్పాటు చేశారు. ఎమ్సెట్ కన్వీనర్ రమణారావుతోపాటు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైద్య ఆరోగ్య ముఖ్యకార్యదర్శి, డిజిపిలతో మంత్రి చర్చలు జరిపారు. డిజిపితో ఎంసెట్ కన్వీనర్ రమణారావు గురువారం కలిసి చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యాయనిపుణులతో కూడా విద్యామంత్రి చర్చించారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్‌తో ఆయన చర్చించారని అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రితో వైద్య మంత్రి చర్చించిన తర్వాత ప్రభుత్వ విధాన ప్రకటన వెలువడుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎమ్సెసెట్ లీకేజిపై విచారణ జరిపిన సిఐడి మీడియాకు ప్రకటన విడుదల చేసినా, ప్రభుత్వానికి మాత్రం పూర్తి నివేదికను శుక్రవారమే అందించనున్నట్టు తెలిసింది. ఎమ్సెట్ లీకేజికి బాధ్యులైన కీలక సూత్రధారులను డిజిపి శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతే ఎమ్సెట్-2పై ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించనుంది. ఎమ్సెట్ లీకేజిలపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ప్రభుత్వ ప్రకటన మధ్యాహ్నం వెలువడే అవకాశం ఉన్నట్టు సిఎంఓ వర్గాల సమాచారం. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్టు విచారణలో తేలిన తర్వాత తిరిగి ఎమ్సెట్‌ను నిర్వహించడం మినహా మరో ప్రత్యామ్నాయం ఉండదని, ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా అలాగే ఉన్నట్టు అధికారవర్గాల సమాచారం. ఒకవేళ లీకేజితో సంబంధం ఉన్న వారి ర్యాంకులు మాత్రమే రద్దు చేసి మిగతా ఫలితాలను యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, అది న్యాయస్థానంలో చెల్లదని న్యాయ నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేసినట్టు సమాచారం. ఇలా ఉండగా దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై శుక్రవారం మధ్యాహ్నం వరకు సస్పెన్స్ కొనసాగనుంది.

చిత్రం.. ఎమ్సెట్ రద్దు చేయొద్దంటూ గురువారం సచివాలయం వద్ద ర్యాంకర్ల ధర్నా