రాష్ట్రీయం

పరబ్రహ్మశాస్ర్తీకి అంతిమ వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ నల్లకుంట, జూలై 28: తెలంగాణ పునర్నిర్మాణంలో అహర్నిశలు కృషి చేసిన చరిత్ర పరిశోధకుడు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్ర్తీ బ్రెయిన్ హేమరేజ్‌కు గురై ఆసుపత్రిలో వ్యాధి తీవ్రరూపం దాల్చి బుధవారం సాయంత్రం మృతి చెందారు. పివి పరబ్రహ్మశాస్ర్తీ భౌతికకాయాన్ని అభిమానులు, బంధుమిత్రుల సందర్శనార్థం గురువారం 10 గంటలకు నల్లకుంటలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. అనంతరం 10:30 గంటలకు బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరులో పుచ్చా వెంకటేశ్వర్లు, రుక్మిణమ్మ దంపతులకు 1921 జూన్‌లో పరబ్రహ్మశాస్ర్తీ జన్మించారు. 95 సంవత్సరాల శాస్ర్తీకి భార్య పుచ్చా మహాలక్ష్మి, కుమారుడు పివి రామ్, ముగ్గురు కుమార్తెలు జయలక్ష్మి, సరస్వతి, మీనా ఉన్నారు. పివి పరబ్రహ్మశాస్ర్తీ తెలంగాణ చరిత్ర, తెలుగు భాష లిపిపై చేసిన పరిశోధన ఎనలేనిదని పలువురు కొనియాడారు. తెలంగాణ చరిత్ర పునర్నిర్మాణ కాలంలో ఆయన మరణించడం తీరని లోటన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నల్లకుంటలోని శాస్ర్తీ నివాసానికి చేరుకొని ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. శాస్ర్తీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పరబ్రహ్మశాస్ర్తీ చిన్ననాటి స్నేహితులు, ఆత్మీయులు ఆయన స్వగృహానికి వచ్చి ఆయనకు నివాళి అర్పించారు.

చిత్రం.. పివి పరబ్రహ్మ శాస్ర్తీ భౌతికకాయం వద్ద నివాళులర్పించిన మండలి బుద్ధప్రసాద్