రాష్ట్రీయం

ఇది న్యాయమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇప్పటికే మూడుసార్లు పరీక్ష రాశా. ఎంతో కష్టపడి ఈ ర్యాంకును సాధించుకున్నా, మళ్లీ రాసే ఓపిక లేదు. లీకు వల్ల లబ్ధి పొందిన వారిని తొలగించి మిగిలిన వారికి కౌనె్సలింగ్ నిర్వహిస్తే సరిపోతుంది. కానీ తప్పు చేసిన వారితో మమ్మల్ని కలిపి మళ్లీ పరీక్ష రాయాలనటం ఎంతవరకు న్యాయం? ఇందులో ర్యాంకు సాధిస్తానన్న ధీమాతో నీట్ కూడా రాయలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి?
- టి హేమసుధ (26వ ర్యాంకర్)

మీరు రాజీనామా చేసి
మళ్లీ గెలవగలరా?
ఒక్క ప్రశ్న లీక్ అయినా మళ్లీ పరీక్ష రాయాలని విద్యాశాఖ, హోం శాఖ మంత్రులు చెబుతున్నారు కదా! దమ్ముంటే వారిని కూడా తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలిచి రమ్మన్నండి చూద్దాం, ఓసారి ఎమ్మెల్యేగా చేసి ఓడిపోతే ఎమ్మెల్సీ దారిని ఎంచుకునే వారు మళ్లీ పరీక్ష అనటం ఎంతవరకు సబబు? అది ఎంత కష్టమో మాకు తెలుసు. తప్పును కప్పిపుచ్చుకునే దిశగా మాట్లాడుతున్నారే తప్పా, విద్యార్థుల వైపు నుంచి ఎందుకు మాట్లాడటం లేదు. ఎందుకంటే మాకు ఓటు హక్కు లేదని మా బాధలను గుర్తించటం లేదు. పరీక్ష పేపర్ లీక్ కావటం అనేది ప్రభుత్వ అసమర్థత. మళ్లీ పరీక్ష అంటూ సింపుల్‌గా మాట్లాడుతున్నారు కదా! ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిని కేవలం రెండు గంటల పాటు నిరాటంకంగా పేపర్‌పై రాయమనండి చూద్దాం! నేను ఉస్మానియా పరిధిలోనే డాక్టర్ కావాలన్నది నా లక్ష్యం. మళ్లీ పరీక్షలంటే సహించేది లేదు. అవసరమైతే న్యాయపోరాటానికైనా సిద్దం.
-పావని రెడ్డి (ర్యాంక్-110), రామంతాపూర్

ఓపిక నశించిపోతోంది
ఓ సారి నీట్ అంటారు..మరోసారి ఎంసెట్ అంటారు. దేనికి ప్రిపేర్ కావాలో తెలియక టెన్షన్‌కు గురయ్యా.. ఎంతో కష్టపడి ఎంసెట్ రాసి 87వ ర్యాం కు దక్కించుకున్నా. లీకు కావటం అనేది ప్రభుత్వ వైఫల్యమే. అందులో మా తప్పేముంది? మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు? మళ్లీ ఎగ్జామ్ పెడితే మళ్లీ ఈ ర్యాంక్ వస్తుందో రాదో తెలియదు? లీకు వల్ల లాభం చేకూరిన వారిని మైనస్ చేసి మిగిలిన వారికి వారి ర్యాంకులతో కౌనె్సలింగ్ చేయాలి. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
-వైష్ణవి కుందారం (ర్యాంక్-87), కోఠి

మమ్మల్ని శిక్షించినట్లే
ఎంసెట్ 1, 2 అంటూ వరుసగా నెంబర్లు వేసి పరీక్ష రాయమనటం ఎంతవరకు న్యాయం? మళ్లీ పరీక్ష రాసే ఓపిక నాకే కాదు.. ఏ విద్యార్థికీ లేదు. అన్ని పుస్తకాలను మరోసారి తిరగేసే సహనమూ లేదు. ప్రశ్నలు లీక్ కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. లీక్ అయిన తర్వాత మళ్లీ పరీక్ష రాయాలని నిర్ణయిస్తే ముమ్మాటికీ మమ్మల్ని శిక్షించినట్టే. రేపు డాక్టర్లమై ప్రభుత్వాసుపత్రుల్లో అందరికీ సేవ చేయాల్సిన వాళ్లం. మళ్లీ పరీక్ష రాయాలంటే మేం పడే అవస్థలను గుర్తించి, ప్రభుత్వం ఎంసెట్‌ను చేయదనే భావిస్తున్నాం..విశ్వసిస్తున్నాం.
-వి. రోష్నీ (ర్యాంక్-344), కూకట్‌పల్లి